ఇయ‌ర్‌ఫోన్స్‌, సెల్‌ ఛార్జ‌ర్ క‌లిపి, దానితో గొంతు నులిమి..!

ఇంట్లో ఒంట‌రిగా ఉన్న ఓ మ‌హిళ దారుణ‌హ‌త్య‌కు గురైన ఘ‌ట‌న ఇది. ఇంట్లోకి ప్ర‌వేశించిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు సెల్‌ఫోన్ ఛార్జ‌ర్‌, ఇయ‌ర్‌ఫోన్స్ రెండూ క‌లిపి తీగ‌లాగ చేసి మ‌హిళ గొంతు నొక్కారు. ఆమె ప్ర‌తిఘ‌టించ‌డంతో త‌ల‌ను నేల‌కేసి బాది దారుణంగా హ‌త‌మార్చారు.

రాజ‌స్థాన్‌లోని స‌లూంబ‌ర్ టౌన్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. హ‌తురాలి పేరు రజ్జూ దేవి. 45 సంవ‌త్స‌రాల ఆ మ‌హిళ బంధువులు హైద‌రాబాద్‌లో నివ‌సిస్తున్నారు.

ఆమె భ‌ర్త దీప‌క్ సింగ్ ఉద‌య్‌పూర్‌లోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో రేడియాల‌జిస్ట్‌. మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన అనంత‌రం భ‌ర్త ఆసుప‌త్రికి వెళ్లాడు. పిల్ల‌లు స్కూల్‌కు వెళ్లారు. ఇంట్లో ఆమె ఒంట‌రిగా ఉన్న స‌మ‌యంలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఇంట్లో ప్ర‌వేశించి, ఆమెను హ‌త‌మార్చారు. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వ‌చ్చిన కుమారుడు త‌ల్లి మృత‌దేహాన్ని చూసి భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు.

 

వెంట‌నే ఈ విష‌యాన్ని దీప‌క్‌సింగ్‌కు తెలియ‌జేశారు. పిల్ల‌లు గ‌ట్టిగా కేక‌లు వేస్తూ వీధిలోకి రావడంతో స్థానికులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. స‌లూంబ‌ర్ టౌన్ పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకు8న్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

సెల్‌ఫోన్ ఛార్జ‌ర్‌, ఇయ‌ర్ ఫోన్స్ క‌లిపి దానితో గొంతు నులిమిన‌ట్టు గుర్తించారు. అనంత‌రం త‌ల‌ను నేల‌కేసి బాద‌డంతో ఆమె మ‌ర‌ణించిన‌ట్లు నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేద‌ని, ద‌ర్యాప్తు సాగుతోంద‌ని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here