పరామర్శించడానికి వచ్చిన తలైవా రజనీకాంత్.. ‘మీరెవరు’ అని అడిగిన వ్యక్తి..!

తూత్తుకుడి బాధితులకు అండగా నిలుస్తానని.. చనిపోయిన వారి కుటుంబాలకు తాను ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటానని.. అలాగే రెండు లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తానని రజనీకాంత్ చెప్పారు. అయితే నిన్న ఆసుపత్రికి వెళ్ళిన రజనీకాంత్ కు అనుకోని ఘటన ఎదురైంది. ఆయన్ను ఓ యువకుడు ‘నువ్వు ఎవరు..?’ అని అడిగాడు.

తూత్తుకుడి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (టీఎంసీహెచ్)కి రజనీకాంత్ రాగా, ఓ యువకుడు రజనీని చూసి ‘మీరు ఎవరు?’ అని ప్రశ్నించాడు. కె.సంతోష్ రాజ్ అనే యువకుడి దగ్గర నుండి రజనీకి ఈ ప్రశ్న ఎదురైంది. 21 సంవత్సరాల సంతోష్ బీకామ్ గ్రాడ్యుయేట్. ఆల్ కాలేజ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ను స్థాపించి, స్టెరిలైట్ కు వ్యతిరేకంగా ఉద్యమం చేశాడు. నిరసనల్లో అతని తలకు బలమైన గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ముందే ఎవరూ పట్టించుకోలేదని.. ఎంతో నష్టం జరిగాక, ప్రాణాలు పోయాక, ఆసుపత్రుల పాలయ్యాక తమ దగ్గరకు వస్తున్న వీఐపీలను సంతోష్ రాజ్ కావాలనే ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నట్టు తెలుస్తోంది.

తనను కావాలనే అలా అడుగుతున్నాడని గ్రహించిన రజనీకాంత్.. తన నవ్వుతోనే సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు. ‘మీరు ఎవరు?’ అన్న ప్రశ్నకు రజనీకాంత్ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here