రజని సరసన సిమ్రాన్?

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ జరుగుతున్నా విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకం పై తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ హీరోయిన్ గా మాజీ భామ సిమ్రాన్ ని ఎంపిక చేసారు. అప్పట్లో తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న ఈమె పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. తాజాగా తమిళంలో ఓ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తన వయసుకుతగ్గ పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్న సిమ్రాన్ ఈ సినిమాలో రజనికి జోడిగా ఎంపిక చేశారు. ప్రస్తుతం డార్జిలింగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ వచ్చే నెలలో చెన్నై లో జరగనుంది. లేటెస్ట్ గా రజని నటించిన కాలా సినిమా తమిళంలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆయన నటించిన రోబో 2.0 విడుదలకు సిద్ధంగా ఉంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here