నేను వచ్చానని చెప్పు.. ఇన్‌స్ట్రాగ్రామ్‌, ఫేస్‌బుక్ లో అడుగుపెట్టిన రజనీకాంత్..!

రజనీకాంత్.. ఇటీవలే రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పాడు. కొన్ని కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించాడు. కొద్ది రోజుల క్రితం చెన్నైలో జరిగిన ఓ సమావేశంలో తాను నిక్కచ్చిగా ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల లోకి వచ్చానని.. చెప్పుకొచ్చారు. ఎంజీఆర్ లేని లోటును భర్తీ చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తాజాగా యువతను ఆకట్టుకోడానికి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో కూడా చేరాడు. కొద్ది రోజుల క్రితమే ట్విట్టర్ లోకి వచ్చినప్పటికీ.. తాజాగా ఇన్‌స్ట్రాగ్రామ్‌, ఫేస్‌బుక్ లలో కూడా తలైవా అడుగుపెట్టాడు.

Vanakkam! Vandhuten nu sollu!

A post shared by Rajinikanth (@rajinikanth) on

వణక్కం (నమస్కారం) అంటూ ఫేస్‌బుక్‌లో మొదటి పోస్ట్ చేశారు. ఇక ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అయితే ‘వణక్కమ్.. వందుటేన్ ను సొల్లు'(నమస్కారం నేను వచ్చానని చెప్పండి) అని తన ఫోటోను పోస్ట్ చేసి చెప్పాడు. ఈ రెండింటిలోనూ అప్పుడే రజనీకాంత్‌కి భారీగా ఫాలోవర్లు యాడ్ అయ్యారు. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు రజనీకాంత్ సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యారని చెప్పుకొంటూ ఉన్నారు. ఆయన అకౌంట్లు ఇవే..

Vanakkam!

Rajinikanthさんの投稿 2018年3月6日(火)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here