ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు ఇదా స‌మ‌యం?

చెన్నై: చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు జ‌ర‌క్కుండా చ‌ర్య‌లు తీసుకోవాలంటూ కొన్ని ప్ర‌జా సంఘాల నాయ‌కులు చేస్తోన్న డిమాండ్‌కు అగ్ర హీరోలు క‌మ‌ల్‌హాస‌న్‌, ర‌జినీకాంత్ మ‌ద్ద‌తు ప‌లికారు. చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించ‌డానికి ఇది స‌రైన స‌మ‌యం కాద‌ని, మ్యాచ్‌ల వేదిక‌ను మ‌రో రాష్ట్రానికి త‌ర‌లించాల‌ని వారు చెబుతున్నారు.

కావేరి జ‌లాల కేటాయింపుల్లో రాష్ట్రానికి అన్యాయం జ‌రిగింద‌ని, ఈ విష‌యంలో ప్ర‌జ‌లంద‌రూ ఏక‌తాటిపైకి వ‌చ్చి పోరాడుతున్న స‌మ‌యంలో.. ఇలాంటి మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించ‌డం స‌రి కాద‌ని అన్నారు. కావేరి న‌దీ జ‌లాల బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తమిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల చేప‌ట్టిన ఆందోళ‌న‌లో ర‌జినీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్ పాల్గొన్నారు.

రజనీకాంత్‌, కమలహాసన్‌లు పాల్గొన్నారు. మ్యాచ్‌లను రద్దుచేయడం సాధ్యం కాకపోతే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులు కనీసం నల్ల బ్యాడ్జీలు ధరించైనా రైతుల నిరసనకు మద్దతు తెలపాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. ఈ నిరసన కార్యక్రమానికి తమిళ నటులు విశాల్‌, విజయ్‌, ధనుష్‌, చియాన్ విక్ర‌మ్‌, ఖుష్బూ, సంగీత దర్శకుడు ఇళయరాజా హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here