నేల నీకు అధికారం, నేల మాకు జీవితం..!

ద‌క్షిణాది సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ న‌టిస్తోన్న తాజా చిత్రం `కాలా`. పా రంజిత్‌ దర్శకుడు. ర‌జినీకాంత్ అల్లుడు, త‌మిళ టాప్‌స్టార్‌ ధనుష్‌ నిర్మాత. ఈ సినిమా తమిళ ట్రైలర్‌ను చిత్రం యూనిట్‌ సోమవారం సాయంత్రం విడుదల చేసింది. ముంబయి మురికివాడ‌ల్లో నివ‌సిస్తోన్న తమిళ ప్ర‌జ‌ల కోసం పోరాడే నాయకుడిగా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించారు ర‌జినీ.

`నేల నీకు అధికారం, నేల మాకు జీవితం..`అనే డైలాగ్ సినిమా స్ట్రెంగ్త్‌ను చెబుతోంది. బాలీవుడ్ న‌టుడు నానా ప‌టేక‌ర్ ఇందులో నెగెటివ్ రోల్ చేశారు. ర‌జినీకాంత్‌ భార్య పాత్రలో ఈశ్వరీరావు, బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్ర పోషించారు. సంతోష్‌ నారాయణన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా వ‌చ్చేనెల 7వ తేదీన విడుదలకు సిద్ధమౌతోంది. క‌బాలి త‌ర్వాత ర‌జ‌నీకాంత్- పా రంజిత్ కాంబోలో తెర‌కెక్కిన చిత్రం ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here