`భ‌ర‌త్‌..`పై ర‌జినీ క‌న్ను!

చెన్నై: సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `భ‌ర‌త్ అనే నేను..` రికార్డుల‌ను కొల్ల‌గొడుతూనే ఉంది. సినిమా విడుద‌లైన రెండు రోజుల్లోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా వంద కోట్ల రూపాయ‌ల‌ను క‌లెక్ట్ చేసిన తెలుగు చిత్రంగా నాన్ బాహుబ‌లి రికార్డును నెల‌కొల్పిన `భ‌ర‌త్‌.. ` 150 కోట్ల రూపాయ‌ల మార్క్‌ను అధిగ‌మించింది.

మ‌హేష్‌బాబు ముఖ్య‌మంత్రిగా న‌టించిన ఈ పొలిటిక‌ల్ డ్రామా మూవీపై త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ క‌న్నేశారు. ఈ సినిమాను త‌మిళంలోకి రీమేక్ చేయ‌డానికి ఆయ‌న ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్టుగా కోలీవుడ్ చెబుతోంది. ఆరోగ్యాన్ని ప‌రీక్షించుకోవ‌డానికి అమెరికా వెళ్ల‌బోతున్నారు ర‌జినీకాంత్‌.

ఆమెరికా నుంచి రాగానే.. ఈ సినిమా హ‌క్కుల‌కు సంబంధించి, చ‌ర్చ‌లు జ‌రుపుతార‌ని, ఫ్యాన్సీ రేట్ అయినా స‌రే! కొనేయాల‌నే ఉద్దేశంతో ర‌జినీ ఉన్న‌ట్లు టీ న‌గ‌ర్ టాక్‌. తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్టు ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించారాయ‌న‌.

త్వ‌ర‌లోనే త‌న పార్టీ పేరును కూడా అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్నారు. `భ‌ర‌త్ అనే నేను..` మూవీని రీమేక్ చేస్తే.. అది త‌న పొలిటిక‌ల్ కేరీర్‌కు హెల్ప్ అవుతుంద‌ని ర‌జినీ గ‌ట్టిగా న‌మ్ముతున్నార‌ట‌. అందుకే- ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని రీమేక్ చేయాల‌ని భావిస్తున్న‌ట్టు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here