సౌదీలో విడుద‌ల కాబోయే మొట్ట‌మొద‌టి ద‌క్షిణ భార‌తీయ సినిమా అదే!

గ‌ల్ఫ్ దేశం సౌదీ అరేబియా మొట్ట‌మొద‌టి సారిగా ఓ ద‌క్షిణాది భార‌తీయ సినిమా విడుద‌ల కాబోతోంది. ఓ సౌత్ ఇండియన్ మూవీ సౌదీ అరేబియాలో విడుద‌ల కావ‌డం ఆ దేశ చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం.

ఆ మూవీ ద‌క్షిణాది సూపర్‌స్టార్ రజినీకాంత్‌ నటించిన ‘2.0’. తమిళ కొత్త ఏడాదిని పుర‌స్క‌రించుకుని ఏప్రిల్ 14వ తేదీన ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

కొత్త‌గా పెద్ద ఎత్తున సినిమా థియేట‌ర్ల‌ను కూడా ఆ దేశంలో నిర్మించ‌బోతున్నారు. 1980లలో సౌదీ అరేబియాలో సినిమా థియేట‌ర్ల‌ను మూసివేశారు.

త‌మ మతానికి విరుద్ధ‌మంటూ అప్ప‌ట్లో ఆ దేశంలో అన్ని థియేటర్లను మూసివేశారు. ఈ మ‌ధ్య‌కాలంలో సౌదీ అరేబియా ప్ర‌భుత్వం త‌న ధోర‌ణిని మార్చుకుంది.

ముస్లిం మ‌హిళ‌లు బ‌హిరంగ కార్య‌క‌లాపాల్లో పాల్గొన‌డానికి అనుమ‌తి ఇవ్వ‌డం, మ‌హిళ‌ల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తేయ‌డం వంటి చ‌ర్య‌ల‌ను తీసుకుంది.

దీనితోపాటు.. సినిమా థియేట‌ర్ల‌ను కూడా పున‌రుద్ధ‌రించబోతోంది. 1980కి ముందు సౌదీ అరేబియాలో బాలీవుడ్ సినిమాలు విడుద‌ల‌య్యేవి. ఆ త‌రువాత వాటి ప్ర‌ద‌ర్శ‌న కూడా నిలిపివేశారు.

మ‌రోసారి నిషేధాన్ని ఎత్తేయ‌డంతో బాలీవుడ్‌, తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం వంటి ప్రాంతీయ భాష సినిమాలు కూడా అక్క‌డ విడుద‌ల కాబోతున్నాయి. ఏప్రిల్ 14న తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో కలిపి దాదాపు 15 భాషల్లో 2.0 మూవీ విడుదల కాబోతోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here