ఫేస్‌బుక్‌లో `కాలా` మూవీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం!

ద‌క్షిణాది సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ న‌టించిన సినిమా మొత్తాన్నీ ఓ ఘ‌నుడు ఫేస్‌బుక్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేశాడు. సింగపూర్‌లో ఓ థియేట‌ర్‌లో ప్ర‌ద‌ర్శించిన ప్రీమియ‌ర్ షోకు వెళ్లిన ఆ యువ‌కుడు టైటిల్స్ ద‌గ్గ‌రి నుంచి సుమారు 40 నిమిషాల సినిమాను త‌న మొబైల్ ఫోన్ నుంచి ఫేస్‌బుక్‌కు ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం చేశాడు. నిందితుడిని ప్ర‌వీణ్ దేవ‌ర్‌గా గుర్తించారు.

సినిమా ప్రీమియర్ షో ముగియ‌డానికి కొన్ని క్ష‌ణాల ముందు- త‌మిళ టాప్ హీరో, న‌డిగ‌ర్ సంఘం ఛైర్మ‌న్ విశాల్‌కు ఈ ఘ‌ట‌న‌పై ప‌క్కా స‌మాచారం అందింది. వెంట‌నే ఆయ‌న ఈ విషయాన్ని ట్విట్ట‌ర్ ద్వారా సింగ‌పూర్‌ పోలీసుల‌కు చేర‌వేశారు. దీనిపై పోలీసుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు.

ఇంకొద్ది సేప‌ట్లో సినిమా ముగుస్తుంద‌న‌గా.. ప్ర‌వీణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అత‌ణ్ని అరెస్టు చేయ‌డంపై ర‌జినీకాంత్ కుమార్తె, ద‌ర్శ‌కురాలు సౌంద‌ర్య హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ప్ర‌వీణ్‌ను పోలీసులు అరెస్టు చేసినందుకు కృత‌జ్ఞ‌తలు తెలిపారు. పైర‌సీని అరిక‌ట్ట‌డానికి అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here