ఇక్కడ ముందు ఉన్నది తల్లి.. వెనుక ఉన్నది కొడుకు.. తర్వాత ఏమిజరిగిందో తెలిస్తే..!

తల్లికి బిడ్డ పుట్టక ముందు ప్రపంచం వేరే ఉంటుంది. కానీ ఆ తర్వాత వాళ్ళే ప్రపంచం. తన కొడుకు కోసం ఏదైనా చేయాలని పరితపిస్తూ ఉంటారు. చివరికి తల్లి నడవలేని స్థితిలో ఉన్నా కూడా కొడుకుకు అన్నం తెచ్చి పెట్టాలని అనుకుంటూ ఉంటుంది. కానీ కొందరు కొడుకులు మాత్రం తల్లిని మరీ హీనంగా చూసుకుంటూ ఉంటారు. వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారిని చూసుకోవడం కూడా దండగ అని అనుకునే నీచులు ఇంకా ఈ సమాజంలో ఉన్నారు. వారిలో ఇక్కడ ఉన్నవాడు కూడా ఒకడు.

సందీప్ నత్వాలీ అనే ఓ వ్యక్తి సొంత తల్లినే బిల్డింగ్ మీద నుండి తోసి చంపేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 64సంవత్సరాల తన తల్లి జయశ్రీబెన్ సెప్టెంబర్ 27న చనిపోయింది. ఇదంతా ఆత్మహత్య అని అనుకున్నారు. కానీ ఇటీవలే సీసీటీవీ ఫుటేజ్ ను చూడగా సందీప్ తన తల్లిని టెర్రస్ పైకి తీసుకొని వెళ్ళి చంపేశాడని తెలుస్తోంది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని గతంలో పోలీసులు కేసు రిజిస్టర్ చేయించారు. ఆమెకు మెదడు సరిగా పనిచేయదని అందుకే అలా చేసి ఉంటుందని కుటుంబసభ్యులు ఇచ్చిన నివేదిక ద్వారా కేసును క్లోజ్ చేశారు.

కానీ ఆ పని చేసింది సొంత కొడుకే అని ఎవరికీ తెలీలేదు. ఇటీవల సీసీటీవీ ఫుటేజ్ ను గమనించగా ఆమె చావుకు ముఖ్య కారణం కొడుకేనని తేలింది. తల్లిని లిఫ్ట్ లో నాలుగో అంతస్థు దాకా తీసుకొని వెళ్ళిన సందీప్ ఆ తర్వాత ఆమెను నడిపించుకుంటూ మెట్లు ఎక్కించాడు. టెర్రస్ మీదకు ఎక్కించి.. అక్కడి నుండి తోసి చంపేశాడు. చెప్పులు లేకుండా ఎక్కిన సందీప్ తల్లి స్లిప్పర్లు వేసుకొని కిందకు దిగివచ్చాడు. ఈ ఘటన పోలీసులకు తెలియడంతో విచారణ మొదలుపెట్టారు. విచారణలో తన తల్లిని చంపింది తానేనని ఒప్పేసుకున్నాడు సందీప్. తన తల్లి దీర్ఘకాలిక వ్యాధి బారిన పడి ఎంతో బాధపడుతూ ఉందని అందుకే తాను ఇలా చేశానని చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here