మ‌నల్ని భ‌య‌పెట్టిన `ఓ స్త్రీ రేపురా.. ఉదంతం! బాలీవుడ్‌లో భ‌యాన‌క మూవీగా!

చాన్నాళ్ల కిందట తెలుగు ప్ర‌జ‌ల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన ఉదంతం `ఓ స్త్రీ రేపురా..` క‌థ‌. ఒళ్లంతా క‌ళ్లున్న ఓ మ‌హిళ అర్ధ‌రాత్రి పూట గాల్లో ఎగురుకుంటూ వీధుల్లో తిరుగుతుంటుంద‌ని, ఏ ఇల్లు క‌నిపిస్తే.. ఆ ఇంట్లో దూరి అక్క‌డి వారి ర‌క్తం తాగుతుంద‌నే భ‌యం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా గ్రామాలు, మారుమూల ప‌ల్లెల‌ను ప‌ట్టి పీడించింది.

దీనితో- ప్ర‌తి ఇంటి గోడ‌ల మీదా ఎర్ర‌మ‌ట్టి లేదా బొగ్గుతో `ఓ స్త్రీ రేపురా` అంటూ రాసిన ఉదంతాలు చాలా చూశాం. ఇందులో వాస్త‌వం ఎంత ఉంద‌నేది మ‌న‌కు తెలియ‌దు గానీ.. ఆ భ‌యాన్ని మాత్రం జ‌నం క‌ళ్ల‌ల్లో చూశాం. ఇదే అంశం మీద తెలుగులో `ఓ స్త్రీ రేపురా` పేరుతో ఓ సినిమా వ‌చ్చింది గానీ, పెద్ద‌గా ఆడ‌లేదు.

చాన్నాళ్ల త‌రువాత ఇదే అంశం మీద బాలీవుడ్‌లో ఓ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ మూవీ పేరు `స్త్రీ`. దీనికి సంబంధించిన ఓ టీజ‌ర్ బుధ‌వారం విడుద‌లైంది. ఆగ‌స్టు 31వ తేదీన సినిమా విడుద‌ల కానుంది. రాజ్‌కుమార్ రావ్ ఇందులో హీరో. గ‌తంలో `రాగిణి ఎంఎంఎస్‌` అనే హార‌ర్ సినిమాలో న‌టించిన అనుభ‌వం రాజ్‌కుమార్ రావ్‌కు ఉంది. శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్‌.

మ‌డ్డోక్ ఫిల్మ్స్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై అమ‌ర్ కౌశిక్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఓ ప‌ల్లెటూరిలో `ఓ స్త్రీ క‌ల్ ఆనా` అని రాసి ఉన్న ఇళ్ల గోడ‌లు, ఇరుకు సందుల గుండా కెమెరాను న‌డిపించిన విధానం.. ఆక‌ట్ట‌కుంది. చివ‌ర్లో ఓ మ‌హిళ‌ను గాల్లో తేలిన‌ట్టుగా చూపించారు. ఈ మ‌ధ్య కాలంలో బాలీవుడ్‌లో కూడా స‌రైన హార‌ర్ సినిమా ప‌డ‌లేదు. ఆ కొర‌త‌ను ఈ సినిమా తీర్చేలా క‌నిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here