రకుల్ ప్రీత్ సింగ్, రానా మీద వస్తున్న రూమర్లపై రకుల్ స్పందన ఇది..!

గత కొద్ది రోజులుగా టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, భాల్లాలదేవుడు రానా రిలేషన్ షిప్ లో ఉన్నారని గత కొద్ది రోజులుగా రూమర్లు తెగ షికారు చేస్తున్నాయి. గతంలో రానాకు, శ్రియకు మధ్య ఏదో ఉందన్న వార్తలు కూడా దక్షిణాదిలో ఎక్కువగా వచ్చాయి. ఇక సుచీలీక్స్ సమయంలో త్రిషను రానా ముద్దు పెట్టుకున్న ఫోటో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు సరికొత్తగా రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

దీనిపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. తాము చాలా కాలంగా ఈ రూమర్లను వింటూ ఉన్నామని రకుల్ తాజా ఇంటర్వ్యూలో తెలిపింది. ఇవన్నీ వదంతులేనని తేల్చి చెప్పింది. తాను హైదరాబాద్ లో తన కుటుంబానికి దూరంగా ఉంటున్నానని.. రానా తన స్నేహితులలో ఒకడని.. ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా రానా తనకు సహాయం చేయడానికి ముందు ఉంటాడని రకుల్ చెప్పింది.

హైదరాబాద్ లో తమ ఫ్రెండ్స్ గ్యాంగ్ 15-20 మంది ఉంటారని.. వారిలో తాను, రానా మాత్రమే పెళ్ళి కాని వాళ్ళని.. అందుకే తమపై ఈ రూమర్లు వస్తున్నాయని హిందుస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ తేల్చి చెప్పింది. ప్రస్తుతం తనకు తన కెరీర్ మీద తప్ప మరే దాని మీద కూడా దృష్టి లేదని రాకుల్ చెప్పింది. రకుల్ నటించిన ‘అయ్యారీ’ సినిమా విడుదలకు సిద్ధమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here