యువ‌తితో కానిస్టేబుల్ రాస‌లీల‌ల్.. వీడియో వైర‌ల్‌!

రామనగర ట్రాఫిక్‌ డీఆర్‌ కానిస్టేబుల్‌ లోకేశ్ ఓ మ‌హిళ‌తో గ‌డిపిన రాసలీలల వీడియో అత‌ని బండారాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. గ‌తంలో లోకేశ్ కానిస్టేబుల్‌గా చిత్రదుర్గలోప‌నిచేస్తున్న స‌మ‌యంలో ఓ యువతితో వివాహేతర సంబంధం ఏర్ప‌డింది. కింద‌టి నెల ఆ యువ‌తికి వేరే యువకుడితో వివాహం జరిగింది.

వివాహమైన త‌రువాత కూడా లోకేశ్ ఆ యువతి త‌న భ‌ర్త‌తో క‌లిసి నివసిస్తున్న హిరియూరు తాలూకా కేకే హట్టి గ్రామానికి వెళ్లసాగాడు. వివాహేత‌ర సంబంధాన్ని కొనసాగించాడు. దీంతో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న గ్రామస్తులు లోకేశ్‌ను చితకబాదారు. తన్నులు తిన్న వీడియో సోషల్‌ మీడియాలో, టీవీ చానళ్లలో ప్రసారమయింది.

ఈ సంఘటనతో లోకేశ్‌ను రామనగరకు బ‌దిలీ చేశారు. అప్ప‌టి రాస‌లీలల వీడియోలు ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. దీంతో స్థానిక పోలీసులకు అవమానకరంగా మారింది. ఇక ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌పీ రమేశ్ బానోత్‌ మాట్లాడుతూ… చిత్రదుర్గ ఎస్పీ నుండి నివేదిక అడిగామని,, అది అందగానే లోకేశ్‌పై చర్యలు తీసుకుంటానని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here