వెంట‌వెంట‌నే రెండు అగ్నిగుండాల్లో ప్ర‌వేశం..ఓ చోట మాత్రం!

రామ‌న‌గ‌ర‌: మారెమ్మ దేవి జాత‌ర‌లో అప‌శృతి చోటు చేసుకుంది. ఆల‌య అర్చ‌కుడు అగ్నిగుండంలో ప‌డి గాయ‌ప‌డ్డారు. క‌ర్ణాట‌క‌లోని రామ‌న‌గ‌ర జిల్లా క‌న‌క‌పుర తాలూకాలోని ఉయ్యంబ‌ళ్లి గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అర్చ‌కుడి పేరు ర‌వి పూజారి. ఉయ్యంబ‌ళ్లిలోని మారెమ్మ దేవాలయం అర్చ‌కుడిగా ప‌నిచేస్తున్నారు.

10 రోజులుగా మారెమ్మ అమ్మ‌వారి జాత‌ర అంగ‌రంగ వైభ‌వంగా కొన‌సాగుతోంది. చివ‌రిరోజు- భ‌క్తులు అగ్నిగుండంలో ప్ర‌వేశించాల్సి ఉంది. దీనికోసం ఆల‌యం ఎదుట రెండు అగ్నిగుండాల‌ను ఏర్పాటు చేశారు. తొలుత‌- ఓ అగ్నిగుండంలో ప్ర‌వేశించి, సుర‌క్షితంగా బ‌య‌టికి వ‌చ్చిన ర‌వి పూజారి.. రెండో గుండంలో దిగిన త‌రువాత త‌డ‌బ‌డ్డారు.

అగ్నిగుండంలో ప‌డిపోయారు. దీనితో ఆయ‌న శ‌రీరం కాలిపోయింది. అప్ర‌మ‌త్త‌మైన భ‌క్తులు వెంట‌నే ఆయ‌న‌ను బ‌య‌టికి తీశారు. అప్ప‌టికే ఆయ‌న‌కు కాలిన గాయాల‌య్యాయి. వెంట‌నే ఆయ‌న‌ను స‌మీప ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ర‌వి పూజారి ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here