రానాకు కుడి కన్ను వేరే వాళ్ళు ఇచ్చిందే.. అయితే ఇప్పుడు మరోసారి..!

కొద్ది రోజుల క్రితం ఓ టీవీ షోలో దగ్గుబాటి రానా మాట్లాడుతూ.. తనకు ముందు కుడి కన్ను కనిపించకపోయేదని.. ఎవరో దాత ఇచ్చిన కంటిని తనకు పెట్టారని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఇప్పుడు మరోసారి ఆ కంటికి శస్త్ర చికిత్స జరగబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ భల్లాలదేవుడు తన కుడి కంటితో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా నొప్పి ఉన్నట్లు రానా చెప్పాడు. దీంతో త్వరలోనే అతడికి సర్జరీ నిర్వహించనున్నారు. ప్రస్తుతం రానా బీపీ చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అది తక్కువ కాగానే సర్జరీ నిర్వహించాలని వైద్యులు భావిస్తున్నారు. రానా కొద్ది రోజుల క్రితమే షూటింగ్ కు బ్రేక్ తీసుకున్నాడు. కొద్ది రోజులు యుఎస్ కు వెళ్ళి.. ఇటీవలే హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు. అయితే సర్జరీకి సంబంధించిన డేట్ ను ఇంకా కన్ఫర్మ్ చేయలేదని రానా తండ్రి సురేష్ బాబు తెలిపారు. రాణాకు జరబోయే సర్జరీ ఇది రెండోదట..! గతంలో డాక్టర్ సతీష్ గుప్తా ఆధ్వర్యంలో సర్జరీని నిర్వహించారు. ఈసారి విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉంది. ఎక్కడా అన్నది ఇంకా స్పష్టత లేదని సురేష్ బాబు చెప్పుకొచ్చారు. ఇక బీపీ గురించి అడుగగా.. ఇది వారసత్వంగా వస్తోందని చెప్పారు సురేష్ బాబు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here