ఆయ‌న బ‌యోపిక్‌లో రానా!

`ఇండియ‌న్ హెర్క్యులెస్‌`గా బ్రిటీష‌ర్ల‌తో బిరుదు అందుకున్న మ‌ల్ల‌యోధుడు కోడి రామ్మూర్తి నాయుడుపై బ‌యోపిక్ రానుంది. ఇందులో కోడి రామ్మూర్తి నాయుడు పాత్ర‌లో రానా న‌టిస్తార‌నే టాక్ ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. 1900 ద‌శ‌కానికి ముందే- ఆయ‌న అవిభాజ్య భారత్‌లో అయిదు వేల‌కు పైగా కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు.

ఏ ఒక్క‌దాంట్లోనూ ఆయ‌న ఓడిపోలేదు. అజేయుడిగా నిలిచారు. శ్రీ‌కాకుళం వీర‌ఘ‌ట్టానికి చెందిన కోడి రామ్మూర్తి నాయుడు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. గ‌జ‌ప‌తి రాజులు ఏర్పాటు చేసిన క‌ళాశాల‌లో ఆయ‌న ప‌నిచేస్తుండేవారు. ఆయ‌న‌పై బ‌యోపిక్‌కు టాలీవుడ్‌లో ఏర్పాట్లు సాగుతున్నాయి. ఓ ప్రిస్టేజియ‌స్ బ్యాన‌ర్‌, ప్రిస్టేజియ‌స్ ద‌ర్శ‌కుడి కాంబోలో ఈ సినిమా తెర‌కెక్కనున్న‌ట్లు తెలుస్తోంది.

ఇందులో టైటిల్ రోల్‌లో రానా న‌టిస్తార‌ని అంటున్నారు. తెలుగు, హిందీ భాషల్లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకొనే అవ‌కాశం ఉంది. ఈ సినిమా క‌థ‌ను కూడా ఓకే చేశార‌ట‌. దీనిపై మ‌రొక‌రు సినిమా తీయ‌కుండా ఉండ‌టం కోస‌మంటూ చిత్ర కథని రైటర్స్ అసోసియేషన్ లో రిజిస్టర్ చేశార‌ని అంటున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here