రంగమ్మ.. మంగమ్మ.. పాట మీద కూడా వివాదం.. ఎందుకంటే..!

రంగస్థలం సినిమాలోని రంగమ్మ-మంగమ్మ పాట ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయింది. ఎం.ఎం.మానసి పాడిన ఈ పాట మన వాళ్లకు తెగ నచ్చేసింది. చాలా మంది రంగమ్మ.. మంగమ్మ.. అంటూ పాటను హమ్ చేస్తూ ఉన్నారు. లహరి మ్యూజిక్ ద్వారా విడుదలైన రంగస్థలం పాటలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇప్పుడు ఈ పాట మీద కొత్త వివాదం మొదలైంది. ఎందుకంటే ఈ పాట లోని లిరిక్స్ మనోభావాలను దెబ్బతీస్తున్నాయట.

ఈ పాట మీద అఖిల భారత యాదవ సంఘం ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ పాట చరణంలోని ‘గొల్లభామ వచ్చి గోళ్ళు గిల్లుతుంటే’ అనే పదాలు తమ జాతి ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బ తినేలా ఉన్నాయని యాదవ సంఘం ప్రెసిడెంట్ రాములు యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. లిరిక్స్ లోని ఆ పదాలను వెంటనే తొలగించాలని ఆయన కోరారు. తమ మాట వినకుంటే ఆందోళన చేస్తామని కూడా హెచ్చరించారు. గతంలో ఇలాగే చాలా పాటలకు సంబంధించిన లిరిక్స్ పై వివాదాలు నడిచిన సంగతి తెలిసిందే.. ఈ వివాదం ఎటు వెళుతుందో.. ఎక్కడి దాకా వెళుతుందో చూడాలి..! ప్రస్తుతానికి ఈ పాటను యు ట్యూబ్ లో కోటి మందికి పైగా వినేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here