మూడు రోజుల్లో రికార్డు కలెక్షన్లు సాధించిన రంగస్థలం.. నాలుగో రోజు కూడా బుకింగ్స్ అదుర్స్..!

రంగస్థలం సినిమాను జనాలు బాగా ఆదరిస్తున్నారు. మొదటి మూడు రోజులూ హాలిడేస్ కావడంతో జనాలు విపరీతంగా థియేటర్లకు వచ్చారు. నాలుగోరోజు నుండి సెలవులు అయిపోయినా కూడా సినిమాకు కలెక్షన్లు ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా ప్రాంతాల్లో ఈరోజు కూడా హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. సినిమా అన్ని వర్గాల వారిని మెప్పించిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. నాన్ బాహుబలి రికార్డులకు చాలా వరకూ దగ్గరైందనే అంటున్నారు అభిమానులు.

స‌మంత క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం శుక్ర‌వారం విడుద‌లైంది. ఫ‌స్ట్ షో నుంచే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. వ‌సూళ్ళ ప‌రంగా దూసుకుపోతోంది. తొలి మూడు రోజుల‌కిగానూ.. తెలుగు రాష్ట్రాల్లో రూ.37.40 కోట్ల షేర్ రాబ‌ట్టుకున్న ఈ సినిమా.. ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.55.50 కోట్ల షేర్ రాబ‌ట్టుకుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. మొదటి వారం అత్యధిక వసూళ్లు అందుకున్న మూడవ చిత్రంగా మెగా పవర్ స్టార్ రంగస్థలం నిలిచింది.

 

మొత్తం 3 రోజులు AP & TS వాటా 37.40Cr

కర్నాటక – 48000000

రెస్ట్ ఆఫ్ ఇండియా – 13000000

USA – 93000000

రెస్ట్ ఆఫ్ వరల్డ్ – 27000000

మొత్తం 3 రోజుల వరల్డ్ వైడ్ వాటా 55.50Cr

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here