రంగ వచ్చేశాడు.. మార్చి 30న వెండితెర మీద అలరించనున్నాడు..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం..! ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూశారు. ఆ సమయం రానే వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్ర టీజర్ ను ఈరోజు సాయంత్రం నాలుగు గంటల 15 నిమిషాలకు విడుదల చేసింది.

మిగతా సినిమాలతో పోల్చుకుంటే రామ్ చరణ్ చాలా విభిన్నంగా ఉన్నాడు ఇందులో.. రంగ.. కాస్త వినపడదు అంటే..! అందుకే ఆ ఊరికి ఇంజనీర్ లాంటోడు అయినప్పటికీ సౌండ్ ఇంజనీర్ అనే రంగను పిలుస్తూ ఉంటారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత నటిస్తోంది. ఇక యాంకర్ అనసూయ, ఆది పినిశెట్టి కూడా సందడి చేయనున్నారు ఈ సినిమా లో.. మార్చి 30వ తేదీన రంగస్థలం సినిమా విడుదల కాబోతోందని టీజర్ ఫినిషింగ్ లో చూపించేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here