జ‌పాన్ టు చెన్నై: కాలా కోసం!

ద‌క్షిణాది సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌కు మ‌న‌దేశంలో మాత్ర‌మే కాదు. మ‌న సినిమాలు విడుద‌ల‌య్యే దాదాపు అన్ని దేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. చైనా, జ‌పాన్ వంటి దేశాల్లోనూ ర‌జినీకి వీరాభిమానులు ఉన్నారు. ర‌జినీకాంత్ సినిమాలు విడుద‌ల‌వుతున్నాయంటే వారికి పండ‌గే. మ‌న‌లాగ థియేట‌ర్ల వ‌ద్ద బ్యాన‌ర్లు క‌డ‌తారో, లేదో తెలియ‌దు గానీ.. ర‌జినీ అంటే ప‌డిఛ‌స్తారు.

ఈ జంట కూడా అలాంటిదే. మ‌రో రెండురోజుల్లో విడుద‌ల కాబోతున్న `కాలా` సినిమాను చూడ్డానికి జ‌పాన్‌ను వ‌చ్చారు. వారి పేర్లు య‌సుద‌, స‌త్సుకి. చెన్నైలోని ఓ థియేట‌ర్‌లో దిగారు. కాలా సినిమా విడుద‌ల కాబోతున్న కాశీ థియేట‌ర్ యాజ‌మాన్యాన్ని కలిశారు. ఆ థియేట‌ర్‌లోనే కాలా పోస్ట‌ర్ ముందు నిల్చుని త‌మ గురించి, చెప్పుకొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను థియేట‌ర్ యాజ‌మాన్యం సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here