ట్రక్కు డ్రైవర్ నుండి కోట్లకు అధిపతి అయ్యాడు.. ఎలాగంటే..!

జీవితంలో ప్రతి ఒక్కరికీ టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే సరైన మలుపు తీసుకుంటారో అప్పుడు విజయం ఖచ్చితంగా లభిస్తుంది. అదే ఇక్కడ చూస్తున్న నరేష్ ప్రజాపతి జీవితంలో చోటుచేసుకుంది. 10 సంవత్సరాల క్రితం వరకూ ఓ మామూలు ట్రక్కు డ్రైవర్.. అయితే ఇప్పుడు కోటీశ్వరుడు. అతడి దగ్గర దాదాపు 22 ట్రక్కులు ఉన్నాయి.. కోటి రూపాయల టర్నోవర్ జరుగుతూ ఉంటుంది.

అహ్మదాబాద్ కు చెందిన నరేష్ ప్రజాపతి సాధారణ ట్రక్కు డ్రైవర్ గా ఉండేవాడు. 2007 లో నరేష్ తన ట్రక్కులో వెళుతుండగా 11000 వాట్ల కరెంట్ లైన్ అతడి వాహనం మీద పడింది. దీంతో అతడి శరీరం 50 శాతం దాకా కాలిపోయింది. దాదాపు రెండు నెలలపాటూ అతడు కోమాలో ఉండిపోయాడు. 17 ఆపరేషన్లు అతడికి చేశారు.

ट्रक ड्राइवर से करोड़पति कारोबारी बना ये शख्स, अाज जीते हैं एेसी लग्जरी लाइफ

కోమా నుండి బయటకు వచ్చిన నరేష్ కు ఆసుపత్రి బిల్లు గురించి కుటుంబసభ్యులు తెలిపారు. తన అకౌంట్ లో 1 లక్షా 50 వేల దాకా ఉన్నాయని అవి వాడుకోమని చెప్పాడు. అయితే అప్పటికే ఆ డబ్బులు అన్ని ఖర్చు అయిపోయాయని.. ఇంకా 8 లక్షలు బిల్లు చెల్లించాలని చెప్పడంతో నరేష్ కు ఏమి చేయాలో తెలీలేదు. దీంతో అతడికి సహాయం చేయడానికి కొందరు పోలీసులు ముందుకు వచ్చారు. అలాగే బంధువులతో అప్పు తీసుకొని నరేష్ ఆసుపత్రి బిల్లును చెల్లించారు.

ट्रक ड्राइवर से करोड़पति कारोबारी बना ये शख्स, अाज जीते हैं एेसी लग्जरी लाइफ

ఆసుపత్రిలో నుండి బయటకు వచ్చిన తర్వాత నరేష్ తన ఎదుగుదల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. తనకు అనుభవం ఉన్న ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ లోకి దూకాడు. ఆ తర్వాత ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు నరేష్. ఆ కంపెనీకి కావాల్సిన ట్రాన్స్ పోర్ట్ అవసరాలు తీర్చడం మొదలుపెట్టాడు నరేష్. ఆ కంపెనీతో పాటుగా నరేష్ కూడా తన వాహనాలను పెంచుకుంటూ వెళ్ళాడు. అప్పులన్నీ తీర్చేసాడు. నరేష్ కష్టాన్ని చూసిన కంపెనీ కూడా అతడికి సహాయం అందించింది. ఇప్పుడు ఆ కంపెనీ ముఖ్యుల్లో ఒకడిగా నరేష్ అయ్యాడు.

 

ट्रक ड्राइवर से करोड़पति कारोबारी बना ये शख्स, अाज जीते हैं एेसी लग्जरी लाइफ

ఒకప్పుడు ట్రక్కు డ్రైవర్ గా ఉన్న నరేష్ వద్ద ఇప్పుడు దాదాపు 22 ట్రక్కులకు పైగా ఉన్నాయి. అలాగే లక్షల విలువ చేసే కార్లు కూడా ఉన్నాయి. దాదాపు రెండు కోట్ల రూపాయల ప్రాపర్టీలు కూడా నరేష్ వద్ద ఉన్నాయి. నరేష్ శరీరం ముందులా పనిచేయదు. కరెంట్ షాక్ ప్రభావంతో అతడి శరీరం చాలా వరకూ దెబ్బతింది. ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న నరేష్ ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ट्रक ड्राइवर से करोड़पति कारोबारी बना ये शख्स, अाज जीते हैं एेसी लग्जरी लाइफ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here