15 నిమిషాలు డ్యాన్స్ చేస్తే రణవీర్ కు 5కోట్లు ఇవ్వబోతున్నారన్నది అబద్దం..!

రణ్‌వీర్‌సింగ్.. ప్రస్తుతం మొత్తం బాలీవుడ్ ఈ యంగ్ హీరోకి ఫ్యాన్స్ అయిపోయారు. అతడి యాక్టింగ్ కానీ.. అభిమానులతో రణవీర్ చేసే సందడి కానీ.. అందరికీ చాలా ఇష్టం. అయితే ఈ ట్యాలెంటెడ్ వ్యక్తిని వచ్చే ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీలో డ్యాన్స్ చేయనున్నాడు రణవీర్ సింగ్.. అందుకు అతడికి ఇవ్వబోతున్న డబ్బులే అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి. 15 నిమిషాల పాటూ ఎంటర్టైన్ చేస్తే 5 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నారని చెప్పారు. పావుగంట ప్రదర్శనకోసం ఈ కుర్ర హీరో ఐదు కోట్లు డిమాండ్ చేశాడట. అందుకు ఐపీఎల్ నిర్వాహకులు అంగీకారం కూడా తెలిపారని కథనాలు వండేశారు. అయితే అవన్నీ నిజం కాదని చెప్పేశారు నిర్వాహకులు. ఐపీఎల్ 11వ సీజన్ మొదటి మ్యాచ్ ఏప్రిల్ 7న మొదలు కాబోతుంది. పద్మావతి సినిమా హిట్ తర్వాత రణవీర్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ఆ క్రేజ్ ను వాడుకోడానికే ఐపీఎల్ నిర్వాహకులు అతనితో డ్యాన్స్ చేయించనున్నారు.. అంతే తప్పితే పెద్దమొత్తంలో డబ్బులు ఇచ్చి కాదట.

గత సీజన్ల మాదిరిగానే ఈ పదకొండో సీజన్‌ని కూడా బాలీవుడ్ అందాల తారల డాన్సులతో క్రికెట్ అభిమానులకు కనువిందు చేయాలని ఐపీఎల్ నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ సారి బాలీవుడ్ స్టార్లు రణ్‌వీర్ సింగ్, వరుణ్ ధావన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, తమన్నాతో పాటు పలువురు వేదికపై డాన్సు చేయనున్నారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అలాగే ప్రముఖ గాయకుడు మికా సింగ్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కూడా తమ ప్రదర్శనలతో ఆకట్టుకోనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here