ప‌క్క రాష్ట్రంలో న‌ల్ల‌చిరుత‌..!

బ్లాక్ పాంథర్‌.. న‌ల్ల‌చిరుతలు మ‌న దేశంలో అరుదుగా క‌నిపిస్తుంటాయి. దేశం మొత్తం మీద ఎనిమిది రాష్ట్రాల్లో మాత్ర‌మే ఒక‌టో, రెండో ఉన్నాయ‌వి. ఆ జాబితాలో తాజాగా మ‌న పొరుగునే ఉన్న ఒడిశా కూడా చేరిపోయింది. ఒడిశా అడ‌వుల్లో న‌ల్ల చిరుత క‌నిపించింది. పులుల సంర‌క్ష‌ణ కోసం అమ‌ర్చిన అడ‌వుల్లో అమ‌ర్చిన సీసీటీవీ కెమెరాల కంటికి క‌నిపించిందీ బ్లాక్ పాంథ‌ర్‌. ఒడిశాలోని సుందర్ గఢ్ జిల్లా గర్జన్ పహాడ్ అటవీ ప్రాంతంలో దీన్ని గుర్తించారు.

గ‌ర్జ‌న్ ప‌హాడ్ అడ‌వుల్లో ఇది సంచరించినట్టు అధికారులు ధృవీక‌రించారు. వాటి అడుగు జాడలను గుర్తించామని ఆ రాష్ట్ర వన్యప్రాణి విభాగం ఛీప్ వార్డెన్ సందీప్ త్రిపాఠి వెల్లడించారు. భంజ్‌న‌గ‌ర్, నవరంగ్‌పూర్ అడవిలో నల్ల చిరుత సంచరిస్తున్నట్టుగా సిసి కెమెరాలో రికార్డు అయ్యాయని ఆప్రాంతం అటవీ సిబ్బంది తెలిపారు. ఇప్ప‌టిదాకా న‌ల్ల చిరుత‌లు కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మ‌హారాష్ట్ర, గోవా, త‌మిళ‌నాడు, అసోం, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌ల‌ల్లో మాత్ర‌మే క‌నిపించాయ‌ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here