చూడ్డానికి బొమ్మ పాములా క‌నిపిస్తోంది గానీ..!

భువ‌నేశ్వ‌ర్‌: చూడ్డానికి అదేదో రంగురంగుల బొమ్మ పాములా క‌నిపిస్తోంది గానీ.. అత్యంత విష‌పూరిత‌మైన స‌ర్పం ఇది. గాల్లో ఎగ‌ర‌డం దీని ప్ర‌త్యేక‌త‌. మ‌న‌దేశంలో చాలా అరుదుగా క‌నిపించే ఈ పాము పేరు `ఒర్నాటె ఫ్ల‌యింగ్ స్నేక్‌..` ఒడిశాలోని మ‌యూర్‌భంజ్ జిల్లాలోని ధ‌న్‌పూర్ గ్రామ శివార్లలో ఉన్న అడ‌వుల్లో క‌నిపించింది.

 

గ‌తంలో ఎప్పుడూ ఇలాంటి పామును చూడ‌లేద‌ని అంటున్నారు ధ‌న్‌పూర్ గ్రామ‌స్తులు. ఈ పాము క‌నిపించిన వెంట‌నే స‌ర్పాల సంర‌క్ష‌కుల‌కు క‌బురు పంపారు. వారు దీన్ని సంర‌క్షించి, సిలిమిప‌ల్ పులుల అభ‌యార‌ణ్యంలో వ‌దిలేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here