మెగా హీరోతో ప్రేమలో ఉన్నావట అని ఆలి అడిగారు.. అందుకు రాశీ ఖన్నా ఏమని చెప్పిందంటే..!

రాశీ ఖన్నా.. గతంలో నటించిన అన్ని సినిమాలు ఒక ఎత్తు.. ఇటీవల వచ్చిన తొలిప్రేమ సినిమా ఒక ఎత్తు..! ఈ సినిమాలో రాశీ ఖన్నా తన యాక్టింగ్ తో ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. వరుణ్ తేజ్ తో కలిసి నటించిన ఈ ప్రేమ కథలో అందరి మనసులకు బాగా దగ్గరైంది. అంతకు ముందు మెగా హీరో అయిన సాయి ధరమ్ తేజ్ తో సుప్రీం సినిమాలో ఆడిపాడింది రాశీ ఖన్నా.. ఈ మధ్య కాలంలో ఆమె మీద ఓ కొత్త రూమర్ వచ్చింది. అదేమిటంటే మెగా హీరోతో ప్రేమలో ఉందని..!

ఈ విషయాన్ని కమెడియన్ ఆలీ తన టీవీ షోలో అడిగేశారు. దీనికి రాశీ ఏమని రిప్లై ఇచ్చేసిందంటే.. ‘ఒక మెగా హీరోతో లవ్ లో పడ్డావనే టాక్ కూడా ఇండస్ట్రీలో వుంది’ అని ఆలీ అడిగారు.. ‘అయితే ఆ మెగా హీరో ఎవరో చెప్పండి’ అంటూ రాశి ఖన్నా నవ్వేసింది. ఇక హిందీలోను .. తెలుగులోను ఏ హీరోలతో నటించాలని ఉందనే ప్రశ్నకి ఆమె స్పందిస్తూ .. ఆమె ఎంతో తెలివిగా ” హిందీలో రణ్ బీర్ కపూర్ తో కలిసి నటించాలని వుందని చెప్పింది. ఇక తెలుగు విషయానికొస్తే పవన్ .. మహేశ్ బాబు .. చరణ్ .. బన్నీ .. ఇలా అందరి హీరోలతో కలిసి నటించాలని వుంది” అంటూ చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here