రషీద్ ఖాన్ నీకు సెల్యూట్ అన్న మహేష్ బాబు.. అందుకు రషీద్ ఏమని రిప్లై ఇచ్చాడంటే..!

సన్ రైజర్స్ హైదరాబాద్.. కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ లో రషీద్ ఖాన్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. బ్యాటింగ్‌లో కేవలం 10 బంతుల్లో 34 రన్స్ చేయడంతో పాటు బౌలింగ్ లో 4 ఓవర్లు వేసి కీలకమైన మూడు వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా ఫైనల్ ఓవర్ లో 2 క్యాచ్ లు అందుకొని సన్ రైజర్స్ కు విజయాన్ని అందించాడు. ఇంతటి అద్భుతమైన ప్రదర్శన చేసిన వ్యక్తిని ఎవరైనా పొగడకుండా ఉంటారా చెప్పండి.

మన ప్రిన్స్ మహేష్ బాబు కూడా రషీద్ ఖాన్ ఆటకు ఫిదా అయిపోయాడు. రషీద్ ఖాన్ నీకు నా సెల్యూట్.. సన్ రైజర్స్ అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చింది. ఆదివారం జరగబోయే ఫైనల్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాను అని చెప్పాడు. దీనికి రషీద్ ఖాన్ వైపు నుండి కూడా స్పందన వచ్చింది. ‘థాంక్స్ బ్రో.. మీ సినిమాలు నేను చూస్తూ ఉన్నాను.. చాలా బాగుంటాయి’ అని చెప్పాడు.

175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 160 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. ఒకానొక దశలో 8 ఓవర్లకు 87/2తో బలంగా కనిపించిన కోల్‌కతా తర్వాత ఒత్తిడి తట్టుకోలేక విజయం ముందు బోల్తాపడింది. ఆదుకుంటాడనుకున్న రాబిన్ ఉతప్ప (2), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (8), ఆండ్రూ రస్సెల్ (3), శివమ్ మావీ (6)లు హైదరాబాద్ బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారు. నాలుగు ఓవర్లు వేసి 19 పరుగులు మాత్రమే ఇచ్చిన రషీద్ ఖాన్ మూడు కీలక వికెట్లను పడగొట్టి కోల్ కతా విజయావకాశాలను దారుణంగా దెబ్బతీశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన కోల్‌కతా 160 పరుగులు మాత్రమే చేసి 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here