ర‌ష్మిక ఎంగేజ్మెంట్ బ్రేక‌ప్?

గీత గోవిందం సినిమాలో ఛార్మింగ్ గా క‌నిపించి, త‌న‌దైన న‌ట‌న‌తో అభిమానుల‌ను మాయ చేసిన‌ హీరోయిన్ రష్మిక మందన్న. ఆమెకు కన్నడ కిరిక్ పార్టీ హీరో రక్షిత్ శెట్టి మ‌ధ్య చెడింద‌నే వార్త‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో నెట్టెక్కి కూస్తున్నాయి. ఇద్ద‌రి ఎంగేజ్మెంట్ బ్రేక‌ప్ అయింద‌నేదే ఆ వార్త‌ల సారాంశం. ఈ  వార్తలు  వైరల్‌గా మారాయి. కిరిక్ పార్టీ సినిమా షూట్ సమయంలో ప్రేమలో పడిన వీరిద్దకి 2017లో జూలైలో కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. అయితే ఈ మధ్య వ్యక్తిగత విభేదాలు తలెత్తడంతో ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకోవాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

అస‌లు కారణమిదేనా?
ర‌ష్మిక‌, ర‌క్షిత్ శెట్టిల ఎంగేజ్మెంట్ జ‌రిగి ఏడాది దాటింది. వారి మ‌ధ్య ఆరోగ్య‌క‌ర‌మైన అనుబంధ‌మే ఉంది. అయిన‌ప్ప‌టికీ వీరిద్ద‌రూ  వ్యక్తిగత కారణాల వల్ల విడిపోవాలనుకొన్నారు. ఈ బంధాన్ని తెంచుకోవడం చాలా కష్టమైనప్పటికీ.. కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకొన్నారు. వారి వారి కెరీర్ ల‌పై దృష్టిపెట్టాలని కుటుంబ సభ్యులు కూడా సలహా ఇచ్చారు అని ఓ కన్నడకు సంబంధించిన ఓ ఆంగ్ల వెబ్‌సైట్ కథనాన్ని వెల్లడించింది. రష్మికతో ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ వార్తలతో రక్షిత్ శెట్టి షాకింగ్ నిర్ణయం తీసుకొన్నాడు. సోషల్ మీడియాలో ఎప్పడూ బిజీగా ఉండే రక్షిత్ దాని నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నారు. దాంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.

సోష‌ల్ మీడియాలో ర‌క్షిత్ పోస్టు
సోషల్ మీడియాకు ఇక సెలవు కొన్ని రోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అనుకొంటున్నాను. నాపై ఆదరాభిమానాలు కురిపిస్తున్న మీ అందరికి నా ప్రేమతో కూడిన ధన్యవాదాలు అని రక్షిత్ ఓ పోస్ట్ పెట్టారు. ఇలాంటి పోస్టు నేపథ్యంలో ఇద్దరి మధ్య ఏదో జరిగిందనే వార్తలకు ఊతమిచ్చింది. గీత గోవిందంలో విజయ్ దేవరకొండతో లిప్‌లాక్ సన్నివేశంలో నటించినందుకుగాను రష్మికను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఒక హీరోతో ఎంగేజ్‌మెంట్ చేసుకొని మరో హీరోతో అత్యంత సన్నిహితంగా నటిస్తావా అని ప్రశ్నించారు.

రష్మిక మందన్న హవా
ప్రస్తుతం టాలీవుడ్‌లో రష్మిక మందన్న హవా కొనసాగుతున్నది. ఆమె నటించిన ఛలో, గీతా గోవిందం భారీ సక్సెస్‌ను సాధించాయి. మరో రెండు చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఆమె నటించిన దేవదాసు చిత్రం త్వరలోనే విడుదల కానున్నది. అలాగే డియర్ కామ్రేడ్‌లో విజయదేవరకొండతో కలిసి నటిస్తున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here