బాప్‌రే! రేవ్‌..రేవ్..రేవ్ పార్టీ! మ‌న క‌ర్నూలులో!

కర్నూలు: న‌గ‌రంలో వెలుగులోకి వ‌చ్చిన రేవ్‌పార్టీ జ‌నాన్ని ఉలిక్కిప‌డేలా చేసింది. గ‌తంలో ఎప్పుడూ లేని ఈ త‌ర‌హా పార్టీలు చోటు చేసుకోవ‌డంతో అటు పోలీసులు, ఇటు స్థానికుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేసింది.

ఈ రేవ్ పార్టీలో ఒక‌రిద్ద‌రు ప్ర‌భుత్వ అధికారులు కూడా పాల్గొన్న‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి 11 గంట‌ల సమ‌యంలో క‌ర్నూలు ఆర్టీసీ బ‌స్‌స్టాండ్ స‌మీపంలోని ఓ హ‌ర్ష రీజెన్సీ లాడ్జీలో రేవ్ పార్టీని ఏర్పాటు చేశారు.

ముగ్గురు యువ‌తుల‌ను హైద‌రాబాద్ నుంచి ర‌ప్పించి, అశ్లీల నృత్యాలు చేయించారు. దీనిపై ప‌క్కా స‌మాచారం అంద‌డంతో షీ టీమ్స్ పోలీసులు రంగంలోకి దిగారు.సుమారు పాతిక‌ మంది ఈ రేవ్‌పార్టీలో పాల్గొన్న‌ట్టు చెబుతున్నారు.

వారిలో ఒక‌రిద్ద‌రు జిల్లా స్థాయి ప్ర‌భుత్వ అధికారులు కూడా ఉన్న‌ట్లు అనుమానిస్తున్నారు. ముగ్గురు యువతులతో పాటు సుమారు 16 మందిపై షీ టీమ్స్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. వారిని అరెస్టు చేశారు. ముగ్గురు యువతులను హెచ్చ‌రించి, వ‌దిలేశామ‌ని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here