ఇంత ఈజీ క్యాచ్ లు కూడా వదిలిపెడతారా.. టైమ్ బ్యాడ్ అంటే ఇదేనేమో..!

రవీంద్ర జడేజా.. బ్యాటింగ్, బౌలింగ్ విషయాలను పక్కన పెడితే ఫీల్డింగ్ లో అతడు అద్భుతమనే చెబుతారు. అతడి ఫీల్డింగ్ వంకలు పెట్టడానికి ఏమీ ఉండదు. కానీ నిన్నటి మ్యాచ్ లో మాత్రం రెండు ఎంతో ఈజీ క్యాచ్ లను జారవిడిచాడు. అది కూడా బ్యాక్ టు బ్యాక్. దీంతో మహేంద్ర సింగ్ ధోనికి కూడా కోపం వచ్చింది. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత దీని గురించే చర్చించారు కూడానూ..!

కేకేఆర్ రన్ ఛేజ్ లో ఉన్నప్పుడు రెండో ఓవర్ లోనే ఇది జరిగింది. కే.ఎం.ఆసిఫ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు మిడ్ ఆఫ్ లో ఉన్నాడు జడేజా. సునీల్ నరైన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. రెండు బంతులు వరుసగా జడేజా చేతిలోకి కొట్టాడు. అయినా వాటిని అందుకోవడంలో జడ్డూ విఫలమయ్యాడు. ఇక వచ్చిన లైఫ్ ను సద్వినియోగం చేసుకున్న నరైన్ హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. ఆ తర్వాత శుభమన్ గిల్, కార్తీక్ కూడా రాణించడంతో కేకేఆర్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక బౌలింగ్ లో, బ్యాటింగ్ లో కూడా జడేజా రాణించలేదు ఈ మ్యాచ్ లో.. బౌలింగ్ లో 4 ఓవర్ల పాటూ బౌలింగ్ వేసిన జడేజా 39 పరుగులు ఇచ్చాడు. బ్యాటింగ్ లో కూడా వేగంగా ఆడకుండా 12 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేశాడు. పాపం జడేజా టైమ్ బ్యాడ్ అని అంటున్నారు నెటిజన్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here