ఈ ఘటనకు కారణం మద్యం మత్తులో ఉండడమేనట..!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని లఖ్మిపూర్ ఖేరి జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. సునీల్ వర్మ అనే వ్యక్తికి పెళ్ళి జరుగుతోంది. అతడితో పాటూ అతడి స్నేహితుడు రామ చంద్ర కూడా అక్కడే ఉన్నాడు. ఇతరులతో కలిసి ఉన్న రామచంద్ర తన లైసెన్స్ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. ఆ తర్వాత కాల్పులు జరుపుతూ.. సునీల్ వర్మ మీదకు కూడా తుపాకీని గురిపెట్టాడు, మొదటి సునీల్ వర్మ పక్కన నుండి వెళ్ళగా రెండోది మాత్రం అతడి ఛాతీ లోకి దూసుకుపోయింది. దీంతో సునీల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రామచంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ఘటనకు ముఖ్య కారణం రామచంద్ర మద్యం మత్తులో ఉండడమేనట.. మద్యం మత్తులో ఉన్న రామ చంద్ర ఏమి చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో ఉన్నాడని బంధువులు చెబుతున్నారు. మద్యం మత్తులో తూలుతూ ఉన్న రామచంద్ర.. గన్ తీసి గాల్లోకి కాల్పులు జరపకుండా ఎదురుగా కాల్పులు జరిపేశాడు. ఆ తూటాలు కాస్తా సునీల్ వర్మలోకి దూసుకువెళ్ళాయి. అంతేకాకుండా పెద్దగా మ్యూజిక్ కూడా పెట్టడంతో కాల్పుల శబ్దం కూడా బయటకు వినిపించలేదు. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారిస్తూ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here