చనిపోడానికి ముందు హనీషా చౌదరి 350 మెసేజీలు చేసిందట.. కారణం చెప్పిన పోలీసులు..!

అనంతపురంకు చెందిన హనీషా చౌదరి అనే యువతి హైదరాబాద్ శివశివానీ కాలేజీ హాస్టల్ లో ఆత్మహత్య చేసుకుంది. ఎంబీఏ చదువుతున్న హనీషా రెండు రోజుల క్రితం తన స్నేహితుడు దీక్షిత్ పటేల్ తో వీడియోకాల్ లో మాట్లాడుతూ ఫ్యానుకు ఉరేసుకుంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు పోలీసులు తెలిపారు. 16వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఒంటిగంట వరకూ దాదాపు 350 మెసేజ్ లు చేసిందని, వీటన్నింటితో పాటు వీడియో కాల్ సంభాషణనూ విశ్లేషిస్తున్నామని పోలీసులు తెలిపారు. దీక్షిత్ నుంచి అనీషాపై ఎటువంటి ఒత్తిడి లేదని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు తెలిపారు.

క్షణికావేశంలోనే ఆమె ఈ పని చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. హనీషాకు చాలా త్వరగా కోపం వచ్చేదని, నచ్చితే అంతే స్థాయిలో ప్రేమను చూపేదని కాలేజీలో ఆమె స్నేహితులు చెబుతున్నారు. చనిపోడానికి ముందు హనీషా 350కి పైగా వాట్స్ యాప్ సందేశాలను తన స్నేహితుడికి పంపిందని కూడా పోలీసులు గుర్తించారు.

అనంతపూర్ లో అనీషాకు ఓ స్నేహితుడు ఉండేవాడని, అతని గురించి దీక్షిత్ కు స్వయంగా చెప్పిందట.. ఆ కారణంగానే ఆమెలో కొత్త అపోహలు మొదలయ్యాయని భావిస్తున్నామని, అదే ఆత్మహత్యకు పురికొల్పి ఉండవచ్చని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఈ నెల 21న అనంతపురంలో అతని వివాహం ఉండగా, దానికి వెళ్లి వస్తానని హనీషా, దీక్షిత్ నుంచి అనుమతి కూడా తీసుకుందట.. కానీ హనీషాకు మనసులో ఎక్కడో భయం మొదలైంది.. దీక్షిత్ ఏమైనా అనుకుంటాడేమోనని ఆమె తీవ్ర ఆందోళనలో పడిపోయింది. స్నేహితురాలు ఇంటికి వెళ్లడంతో ఒంటరిగా గదిలో ఉండిపోపోయింది హనీషా. ఆ తర్వాత దీక్షిత్ తో మాట్లాడడం.. ఆత్మహత్య చేసుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయని పోలీసులు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here