సైడ్ మిర్ర‌ర్ చూసి..ఉలిక్కిప‌డ్డ డ్రైవ‌ర్‌! ఒళ్లు జ‌ల‌ద‌రిస్తోంది క‌దూ!

ఈ ఫొటోలో కార్ సైడ్ మిర్ర‌ర్‌కు చుట్టుకుని క‌నిపిస్తోన్న‌ది అరుదైన‌, అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన పాము. రెడ్ బెల్లీయిడ్ బ్లాక్ స్నేక్‌. పైనంతా న‌ల్ల‌గా ఉండి, కింది భాగంలో ఎర్ర‌గా ఉండే విష‌పూరిత పాము ఇది.

అందుకే దీనికి రెడ్ బెల్లీయిడ్ బ్లాక్ స్నేక్ అనే పేరొచ్చింది. కాటేస్తే అంతే సంగ‌తులు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ శివార్ల‌లో రోడ్డు మీద పార్క్ చేసిన కారు సైడ్ మిర్ర‌ర్‌కు చుట్టుకుని క‌నిపించింది.

న‌ల్ల‌గా ఉండ‌టంతో పెద్ద‌గా చూసుకోకుండా కారెక్కాడు టెడ్ ఓగియ‌ర్ అనే ఆసామి. ఆ త‌రువాత సైడ్ మిర్ర‌ర్ మీద చూపు ప‌డేస‌రికి ఉలిక్కిప‌డ్డాడు.

కారును రోడ్డు ప‌క్క‌న ఆపేశాడు. నెమ్మ‌దిగా ఆ పాము కారు విండో మీదుగా పాక్కుంటూ వెళ్లిపోయింది. ఆ పాము ఫొటోల‌ను తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Well poor Ted had an experience today driving back from Eden. He had a visitor on his car. I would have jumped out the…

Nolans Auto Parts & Industrial Suppliesさんの投稿 2018年1月9日(火)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here