రెడ్ ఎఫ్ఎం రేడియో జాకీ..ఒంటిపై ఆరు క‌త్తిపోట్లు!

తిరువ‌నంత‌పురం: మాజీ రేడియో జాకీ ఒక‌రు దారుణ‌హ‌త్య‌కు గుర‌య్యారు. రెడ్ ఎఫ్ఎంలో ప‌నిచేసి, ఇటీవ‌లే మానివేసిన రాజేష్ ఆలియాస్ ర‌సిక‌న్ రాజేష్‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు క‌త్తుల‌తో దాడి చేశారు. దారుణంగా పొడిచి చంపారు. రాజేష్ ఒంటిపై ఆరు క‌త్తిపోట్లు ఉన్న‌ట్టు డాక్ట‌ర్లు తెలిపారు. కేర‌ళ రాజ‌ధాని తిరువనంత‌పురంలోని మాద‌వూర్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

రాజేష్‌.. మిమిక్రీ క‌ళాకారుడు కూడా. అభిమానులు అత‌ణ్ని ర‌సిక‌న్ రాజేష్‌గా పిలుస్తారు. తిరువ‌నంత‌పురం మాద‌వూర్‌లోని స్టూడియో నుంచి త‌న స్నేహితుడితో క‌లిసి బైక్‌పై బ‌య‌లుదేరిన రాజేష్‌ను కారులో వ‌చ్చిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అడ్డ‌గించారు. క‌త్తుల‌తో దాడి చేశారు. రాజేష్‌ను ల‌క్ష్యంగా చేసుకుని దాడి చేశారు. అత‌ణ్ని పొడిచి చంపారు.

ఈ దాడిలో అత‌ని స్నేహితుడు క‌త్తిపోట్ల‌కు గుర‌య్యాడు. వారిద్ద‌ర్నీ స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్క‌డ చికిత్స పొందుతూ రాజేశ్‌ మరణించాడు. అతని స్నేహితుడి పరిస్థితి విషమంగా ఉందని డాక్ట‌ర్లు తెలిపారు. హంతకులను పట్టుకునేందుకు విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here