ఇతడికి బాలీవుడ్ లో చిన్న ఛాన్స్ కూడా రాలేదు.. కానీ లాటిన్ అమెరికాలో సూపర్ స్టార్ అయ్యాడు..!

కొందరు కొన్ని కోరుకుంటారు.. కానీ భగవంతుడు వేరే ఏవేవో అందిస్తాడు. బీహార్ కు చెందిన ప్రభాకర్ షరాన్ స్టోరీ అలాంటిదే. బాలీవుడ్ లో సైడ్ క్యారెక్టర్లు అయినా చేయడానికి సిద్ధపడ్డ అతడికి ఇక్కడ లక్కు కలిసి రాలేదు. కానీ లాటిన్ అమెరికాలో సూపర్ స్టార్ గా నిలిచాడు.

బీహార్ లోని మోతిహరి ప్రాంతానికి చెందిన షరాన్ మొదట ముంబైకి వెళ్ళాడు. అక్కడ అతడు బాలీవుడ్ లో ఛాన్స్ కోసం ఎదురుచూశాడు. కానీ అనుకున్నట్లుగా జరగలేదు. అలాంటి సమయంలో అతడు కోస్టారికాకు వెళ్ళాడు. అక్కడే ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. అన్నీ అనుకున్నట్లే జరిగితే ఎలా చెప్పండి.. 2010 లో అతడి వ్యాపారం అక్కడ నష్టాల పాలైంది. భార్య అతడికి హ్యాండ్ ఇచ్చింది. దీంతో అన్నిటినీ పోగొట్టుకొని భారత్ కు వచ్చేశాడు.

ఆ తర్వాత 4 సంవత్సరాలకు మళ్ళీ కోస్టారికాకు వెళ్ళాడు. బాలీవుడ్ స్టైల్ లో కోస్టారికా ప్రజలకు అర్థం అయ్యేలా సినిమా తీశాడు. అంతే సినిమా అక్కడి వాళ్లకు బాగా కనెక్ట్ అయింది. 1.5మిలియన్ డాలర్ల కలెక్షన్లను వసూలు చేసింది ఆ సినిమా..! ఆ తర్వాత వరుసగా సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. ‘ఎన్రేడడోస్:లా కంఫ్యూషన్’ అనే స్పానిష్ సినిమా తీశాడు. ఇందులో ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ స్కాట్ స్టీనర్ కూడా నటించాడు. ఈ సినిమా మోస్ట్ పాపులర్ సినిమాగా నిలిచింది. ప్రభాకర్ షరాన్ అక్కడ సూపర్ స్టార్ అయ్యాడు. త్వరలో అతడు ఈ సినిమాను భారత్ లో కూడా విడుదల చేయబోతున్నాడు. ఇప్పుడు షరాన్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఎక్కడి బీహార్ లోని చిన్న గ్రామం ఎక్కడ కోస్టారికా.. టైమ్ మనది అవ్వాలే కానీ ఏదైనా చేసేయొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here