మ‌నోళ్ల కంటే ఎక్కువా? బాత్‌టబ్‌లో కూర్చుని రిపోర్టింగ్ చేసిన‌ట్టు..!

గోల్డ్‌కోస్ట్‌: అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి మ‌ర‌ణించిన‌ప్పుడు మ‌న టీవీ ఛాన‌ళ్ల అతి చూడ‌న‌ల‌వి కాలేదు. బాత్‌రూమ్‌, బాత్‌ట‌బ్‌లో కూర్చుని, ప‌డుకుని మ‌రీ రిపోర్టింగ్ చేశారు. అది వేరే విష‌యం. ఇప్పుడు బీబీసీ రిపోర్ట‌ర్ కూడా అదే అవ‌తారం ఎత్తారు గానీ కాస్త డిఫ‌రెంట్‌. లైవ్‌లో రిపోర్టింగ్ ఇస్తూ, పొర‌పాటున స్విమ్మింగ్‌పూల్‌లో ప‌డిపోయాడు.

 

ఇదంతా- లైవ్‌లో టెలికాస్ట్ కూడా అయ్యింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జ‌రుగుతోన్న కామ‌న్వెల్త్ గేమ్స్ సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆ బీబీసీ విలేక‌రి పేరు మైక్ బుషెల్‌. ఈత‌లో బంగారు ప‌త‌కాన్ని సాధించిన ఇంగ్లండ్ టీమ్ స్విమ్మింగ్‌పూల్ వ‌ద్ద బుషెల్ ఇంట‌ర్వ్యూ తీసుకున్నాడు.

స్విమ్మింగ్‌పూల్ గ‌ట్టున కూర్చుని, కాళ్ల‌ను స్విమ్మింగ్‌పూల్‌లో జార‌విడిచి, కులాసాగా కూర్చున్న టీమ్ మెంబ‌ర్ల‌తో ఇంట‌ర్వ్యూ కోసం బుషెల్ మైక్ తీసుకుని పూల్‌లోకి దిగాడు.

దిగుతూనే అక్క‌డో మెట్టు ఉంద‌నుకునే ఉద్దేశంతో అడుగు ముందుకేశాడు. అంతే! నీటిలో ప‌డిపోయాడు. ఫ‌క్కుమంటూ న‌వ్వారు స్విమ్మ‌ర్లు. తేరుకుని బ‌య‌టికి వ‌చ్చిన బుషెల్‌.. త‌డిచిన దుస్తుల్లోనే ఇంట‌ర్వ్యూను కొన‌సాగించాడు. ఇదంతా- లైవ్‌లో టెలికాస్ట్ అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here