క్రికెట్ ఆడుతూ ప్రాణాలు కోల్పోయిన హైదరాబాద్ యువకుడు.. వీడియోలో రికార్డ్..!

హైదరాబాద్ లో రిపబ్లిక్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన డే-నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఆ యువకుడు క్రికెట్ ఆడుతుండగా హార్ట్ అటాక్ రావడంతో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డు అయింది.

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో రిపబ్లిక్ డే సందర్భంగా డే అండ్ నైట్ క్రికెట్ టోర్నీని ఏర్పాటు చేశారు. క్రికెట్ అభిమానులు పెద్ద మొత్తం లో అక్కడకు చేరుకొని మ్యాచ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఆంటోనీ అనే 25సంవత్సరాల యువకుడు బౌలింగ్ వేస్తున్నాడు. బౌలింగ్ వేయడానికి వచ్చిన ఆంటోనీకి హార్ట్ అటాక్ రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. నంది నగర్ కు చెందినా ఆంటోనీని స్థానిక ఆసుపత్రి కి తీసుకొని వెళ్ళగా అతడు మరణించాడని వైద్యులు తెలిపారు. బంజారా హిల్స్ పోలీసులు కూడా ఇది సహజ మరణమేనని తేల్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here