మన వాళ్ళు ఏమీ మారలేదట.. మొత్తం దాచేసుకున్నారు..!

నోట్ల రద్దు.. మోడీ తీసుకున్న ఈ షాకింగ్ నిర్ణయం వలన ఏమి ప్రయోజనాలు కలిగాయో.. ఎవరికీ తెలీలేదు.. వాళ్ళు కూడా చెప్పలేదు. అప్పట్లో నోట్ల కోసం పడిన కష్టాలు అన్నీ.. ఇన్నీ కావు. చాలా మంది.. చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. అయితే మళ్ళీ నోట్ల కోసం కష్టాలు మొదలయ్యాయి.. అయితే ఈ నోట్ల కష్టాలకు కారణం మన వాళ్ళేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటోంది. విడుదల చేసిన డబ్బులన్నిటినీ దాచేసుకోవడంతోనే మరోసారి నోట్ల కష్టాలు వచ్చాయని ఆర్బీఐ తమ నివేదికలో వెల్లడించింది.

ఏప్రిల్ 20న తాము మరోసారి డబ్బు పంపామని.. అయితే పంపిన డబ్బు అంతా మనవాళ్ళు విత్ డ్రా చేసేశారట.. గత వారంలో 16.34 వేల కోట్లు విత్ డ్రా అయ్యాయని తెలిపింది. కానీ గత మూడు వారాల వ్యవధిలో ఏకంగా 59.52 వేల కోట్లు విత్ డ్రా అయ్యాయని తెలిపింది. ప్రజలు విత్ డ్రా చేసుకున్న డబ్బులు వారం పదిరోజుల్లో తిరిగి సర్క్యులేషన్ లోకి వస్తాయని, కానీ కొత్త నోట్లు తిరిగి బ్యాంకులకు రావడం లేదని తెలిపింది. ఇంట్లో ఎక్కువ డబ్బు దాచుకోవాలని భావిస్తున్న వారి కారణంగానే ఇది జరుగుతోందని తెలిపింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మొత్తం 1.89 లక్షల కోట్లు చలామనీలో ఉంటే ఇందులో అత్యధిక మొత్తం ఇళ్లలో ఉందని అంచనా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here