రాత్రికి రాత్రి ఆ ఊరిలోని వాళ్ళంతా కోటీశ్వరులు అయిపోయారు.. మనదేశంలోనే..!

రాత్రికి రాత్రి ఊరంతా కోటీశ్వరులు అవ్వడం ఎక్కడైనా చూశారా.. లేదు కదా.. కానీ అరుణాచల్ ప్రదేశ్ లోని ఓ చిన్న గ్రామం రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోయారు. అందుకు కారణం రక్షణ మంత్రిత్వ శాఖ.. తమ మాటను నిలబెట్టుకున్న డిఫెన్స్ మినిస్ట్రీ బోంజా గ్రామస్థులను కోటీశ్వరులను చేసింది.

అయిదు సంవత్సరాల క్రితం బోంజా గ్రామంలో భారత ఆర్మీ తమ అవసరాల కోసం వారి దగ్గర నుండి భూములను స్వాధీనం చేసుకుంది. అయితే వారికి నష్టపరిహారం కోసం అన్ని పనులూ పూర్తీ చేసేశారు. దీంతో భూములు ఇచ్చిన వారందరినీ పిలిపించి.. డబ్బులు ఇచ్చేశారు. అది కూడా భారీ మొత్తంలో..! ఒక్కరికి కూడా కోటి రూపాయలకు తక్కువ లేదు. అత్యధికంగా ఒకరికి 6 కోట్ల 73లక్షల రూపాయలు ఇచ్చారు. ఇక ఆ తర్వాత మరొకరికి 2కోట్ల 44లక్షలు ఇచ్చారు. అలా మొత్తం 40.8 కోట్ల రూపాయలు 31మంది యజమానులకు పంచారు. అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండు డబ్బులను వారికి ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here