నంద్యాల నుండి తిరుమలకు వెళ్తున్నారు.. ఇంతలో..!

చిత్తూరు జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రేణిగుంట మండలం మామండూరు వద్ద ఈ ఘోరం చోటుచేసుకుంది. సిమెంట్ లారీ అదుపు తప్పి తూఫాన్ వాహనాన్ని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. మృతులు నంద్యాలకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు,ఇద్దరు పురుషులు,ఒక చిన్నారి ఉన్నారు. కోడూరు మీదుగా తిరుమల దర్శనార్థం వస్తుండగా ఈ ధుర్ఘటన జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here