కరీంనగర్ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. కిటికీల పక్కన కూర్చున్నవాళ్ళకే..!

కరీంన‌గ‌ర్ జిల్లాలోని మానకొండూరు మండలం చంజర్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 15 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మ‌రోక‌రు మ‌రణించారు. ఆర్టీసీ బ‌స్సును లారీ ఢీకొనడంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కరీంనగర్ – వరంగల్ రహదారిపై రెండు లారీలు ఓవర్ టేక్ చేసుకుంటుండగా ఎదురుగా వస్తున్న బస్సును లారీ ఢీకొంది. ప్రమాదంలో బస్సు వెనకాల బైక్ లపై వస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ వెనకాల నాలుగో సీట్ నుంచి బ‌స్సును లారీ బ‌లంగా ఢికొట్టింది. దీంతో బ‌స్సు వెనుక భాగంతో పాటు కిటికీల ప‌క్క‌న కూర్చున్న ప్ర‌యాణికులు నుజ్జునుజ్జ‌య్యారు. డ్రైవ‌ర్‌తో పాటు బ‌స్సు ముందు భాగంలో కూర్చున్నప్ర‌యాణికులకు స్వల్ప గాయాల‌య్యాయి. ప్రమాద స్థలానికి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేరుకున్నారు. మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి ప్రకటించారు. ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here