దినేష్ కార్తీక్ కొట్టిన ఆఖరి బాల్.. సిక్సర్.. చూడలేకపోయిన కెప్టెన్ రోహిత్ శర్మ.. ఎందుకంటే..!

భారత క్రికెట్ అభిమానులు చాలా మంది.. దినేష్ కార్తీక్ ఆ ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే బంగ్లాదేశ్ అభిమానులను.. ఆటగాళ్ళను.. ఇక ఆపలేకపోయేవాళ్ళమని సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటూ ఉన్నారు. ఆఖరి బంతి టెన్షన్ ను తట్టుకోలేక చాలామంది కళ్ళు మూసేసుకున్నారు కూడానూ..! అయితే.. అప్పటికే కార్తీక్ చితక్కొట్టుడు చూసిన చాలా మంది దినేష్ కార్తీక్ కనీసం ఫోర్ అయినా కొట్టగలడు అని భావించి టీవీలకు అతుక్కుపోయారు. అయితే భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం దినేష్ కార్తీక్ కొట్టిన విన్నింగ్ సిక్సర్ ను చూడలేకపోయాడట. ఎందుకంటే.. సూపర్ ఓవర్ ఏమైనా జరుగుతుందేమోనన్న అనుమానంతో ప్యాడ్ లు కట్టుకోడానికి రోహిత్ వెళ్ళిపోయాడట..!

ఆఖరి బంతికి దినేష్ కార్తీక్ ఫోర్ కొట్టి ఉండి ఉంటే సూపర్ ఓవర్ జరిగి ఉండి ఉండేది. భారత్ తరపున రోహిత్ శర్మ సూపర్ ఓవర్ ఆడేవాడు. అందుకే రోహిత్ ప్యాడ్ లు కట్టుకోడానికి వెళ్ళిపోయాడు. ఈ ఘటనను రోహిత్ శర్మనే చెప్పాడు కూడానూ “మా జట్టు గెలవడానికి చివరి ఓవర్లో ఆఖరి రెండు బంతులకు ఐదు పరుగులు చేయాలి. ఐదో బంతికి శంకర్ ఔటయ్యాడు. అప్పటికి మా జట్టు స్కోరు 162 పరుగులు. ఇక మిగిలింది ఒక్క బంతే. స్ట్రైకింగ్‌లో కార్తీక్ ఉన్నాడు. అతను ఎలాగైనా ఫోర్ కొడతాడు. మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది. అలాంటప్పుడు సూపర్ ఓవర్ ద్వారానే ఫలితాన్ని నిర్ణయిస్తారు. ఇదంతా అంచనా వేసుకుని నేను డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి ప్యాడ్ కట్టుకుంటున్నాను. ఆ సమయంలోనే కార్తీక్ సిక్స్ కొట్టి జట్టుకు మరపురాని విజయాన్ని అందించాడు” అని మ్యాచ్ అనంతరం రోహిత్ మీడియాతో అన్నాడు. సూపర్ ఓవర్ నిబంధనల ప్రకారం ఎవరైతే చేజింగ్ చేస్తున్నారో.. వాళ్ళే మొదట బ్యాటింగ్ ఆడాల్సి ఉంటుంది. అందుకోసమే సమయం ఎందుకు వృధా చేయాలని రోహిత్ ముందుగానే రెడీ అయిపోదామని అనుకుని ఉంటాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here