త‌ల ఒక‌చోట‌..మొండెం ఒక‌చోట‌!

రౌడీషీట‌ర్ దారుణ‌హ‌త్య‌కు గురైన ఘ‌ట‌న ఇది. హ‌తుడి పేరు చైతు. అత‌నో రౌడీ షీట‌ర్‌. ప్ర‌త్యర్థులు అత‌ణ్ణి హ‌త‌మార్చి ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరు శివార్ల‌లోని హోసూరులో చోటు చేసుకుంది. రెండురోజుల కింద‌ట చైతు అదృశ్య‌మ‌య్యాడు. దీనిపై హోసూరు మ‌త్తికెరె పోలీస్‌స్టేష‌న్‌లో కేసు కూడా న‌మోదైంది.

కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు అత‌ని కోసం గాలిస్తున్న త‌రుణంలో.. మృత‌దేహం ల‌భించింది. హోసూరు-భాగ‌లూరు మార్గంలో నిర్జ‌న ప్ర‌దేశంలో అత్యంత భ‌యాన‌క స్థితిలో ఉన్న ఈ మృత‌దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హోసూరులో రియ‌ల్ ఎస్టేట్ ఉద్యోగి వ‌సంత్‌, స్టీల్ వ్యాపారి ముస్తాక్‌ల హ‌త్య‌తో చైతుకు ప్ర‌త్యక్ష సంబంధాలు ఉన్నాయ‌ని పోలీసులు చెబుతున్నారు.

హోసూరు మ‌త్తికెరె, అనేక‌ల్ పోలీస్‌స్టేష‌న్ల‌లో అత‌నిపై ప‌లు కేసులు న‌మోదై ఉన్నాయి. ప్ర‌త్యర్థులు అత‌ణ్ణి కిడ్నాప్ చేసి, హ‌త‌మార్చి ఉంటార‌ని అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here