ఆంధ్ర స‌రిహ‌ద్దు చెక్‌పోస్ట్‌ వ‌ద్ద‌ రూ.120 కోట్లు ప‌ట్టివేత‌..అస‌లు విష‌యం ఏమిటంటే!

చిక్‌బ‌ళ్లాపుర‌: `క‌ర్ణాట‌క-ఆంధ్ర స‌రిహ‌ద్దుల్లో ఉన్న తిప్ప‌గాన‌హ‌ళ్లి చెక్‌పోస్ట్ వ‌ద్ద ఎన్నికల అధికారులు వాహ‌నాల‌ను త‌నిఖీ చేస్తుండ‌గా.. 120 కోట్ల రూపాయ‌లు ల‌భించాయి. ఇవీ ఫొటోలు..` అంటూ రెండురోజులుగా సోష‌ల్ మీడియాలో కొన్ని పిక్స్ భ‌లేగా వైర‌ల్‌గా అయ్యాయి. అదంతా హంబ‌క్.

అలాంటిదేదీ చోటు చేసుకోలేద‌ని ఎన్నిక‌ల అధికారులు తాజాగా ప్ర‌క‌టించారు. ఈ వార్త‌ను న‌మ్మొద్దంటూ వారు ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు వేరే వేరే ఫొటోల‌ను జ‌త చేసి, ఈ వార్త‌ను సృష్టించార‌ని పోలీసులు తెలిపారు.

 

క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని స‌రిహ‌ద్దుల్లోని తిప్ప‌గాన‌హ‌ళ్లి చెక్‌పోస్ట్ వ‌ద్ద త‌నిఖీల‌ను అధికారులు క‌ట్టుదిట్టం చేశారు. అన్ని వాహ‌నాల‌నూ త‌రువుగా త‌నిఖీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, గ‌తంలో వివిధ సంద‌ర్భాల్లో ఐటీ అధికారులు దాడులు చేసిన సంద‌ర్భంగా దొరికిన బ్లాక్‌మ‌నీ ఫొటోల‌ను జ‌త చేసి, ఈ వార్త‌ను సృష్టించిన‌ట్లు తేలింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here