హీరో ‘నాని’ ని అన్ని మాటలు తిట్టింది.. శ్రీ రెడ్డి బిగ్ బాస్ లో ఉంటుందా.. దీనికి సమాధానం ఇదే..!

‘ఏదైనా జరగొచ్చు’ అన్నది తెలుగు బిగ్ బాస్ సీజన్-2 ట్యాగ్..! జూన్ 10 నుండి సీజన్-2 మొదలు కాబోతోంది. అయితే ఇంతలోనే నెటిజన్లు ఊహాగానాలు చేసుకుంటున్నారు. ఎవరు వెళితే మంచిది.. ఎవరు వస్తారు అన్నదానిమీదే ఎక్కువగా చర్చించుకుంటూ ఉన్నారు. ఇంతలో ఏదో వెబ్ సైట్ కంటెస్టెంట్స్ గురించి ఓ రాయి వేశారు.

-హీరో రాజ్ త‌రుణ్
– సింగ‌ర్ గీతా మాధురి
– యాంక‌ర్ శ్యామ‌ల
– యాంక‌ర్ లాస్య‌
– హీరోయిన్ రాశి
– హీరోయిన్ చార్మి కౌర్‌
– ధ‌న్య బాల‌కృష్ణ‌
– జూనియ‌ర్ శ్రీదేవి
– హీరోయిన్ గ‌జాలా
– చాందిని చౌద‌రి
– శ్రీ రెడ్డి
– వ‌రుణ్ సందేశ్
– థ‌నీష్
– వైవా హ‌ర్షా
– క‌మెడీయ‌న్ వేణు
– ఆర్య‌న్ రాజేష్

పైన చూస్తున్న లిస్టు అదే.. ఇది ఎంత మాత్రం నిజమో ఎవరికీ తెలియదు. ఇక ఎక్కువగా చర్చించుకుంటున్న పేరు శ్రీ రెడ్డి గురించే..! ఆమె గతంలో ఈ ప్రోగ్రాంకు హోస్ట్ గా చేస్తున్న నాని మీద తీవ్ర ఆరోపణలు చేసింది. నాని అమ్మాయిలను ఆడుకుంటాడని తీవ్రమైన ఆరోపణలు చేసింది. అలాంటిది ఆమెనే తీసుకు వస్తున్నారా లేదా అన్నది ఇంకా ఎటువంటి క్లారిటీ కూడా లేదు. ఇప్పటికే ఓ వర్గాన్ని సోషల్ మీడియాలో శ్రీ రెడ్డి ఆడుకుంటూ ఉంది. ఇప్పుడు ఆమెను తీసుకొని వస్తే తాము ప్రోగ్రాం చూసేది కూడా మానేస్తామని నెటిజన్లు అంటున్నారు. దీనిపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. అయినా ఇంకా 10 రోజులు టైమ్ ఉంది. అంతలోనే మన వాళ్లకు ఎందుకు తొందరో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here