71 మందిని మింగేసిన విమాన ప్రమాదం..!

రష్యాకు చెందిన విమానం కుప్పకూలిన ఘటనలో ఏకంగా 71మంది మరణించారు. సరటోవ్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఏఎన్ 148 రకపు విమానం ప్రయాణీకులతో బయలుదేరిన కొద్ది సేపటికే కుప్పకూలిందని అక్కడి మీడియా స్పష్టం చేసింది. మాస్కోలోని డుమోడెడ్వో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానం బయలుదేరిన కొద్ది సేపటికే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. అర్గునోవ్ అనే గ్రామం సమీపంలో కూలిపోయింది.

ఓరస్క్ నగరానికి బయలుదేరిన ఈ విమానంలో మొత్తం 71 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో 71 మంది మృతి చెందినట్టు సమాచారం. కాగా, ఈ ప్రమాద సంఘటనను అధికారులు ధ్రువీకరించారు. చనిపోయిన వారిలో 65 మంది ప్యాసెంజర్లు కాగా మిగిలిన వారు విమాన సిబ్బంది. ఈ సంఘటనపై రష్యా ప్రభుత్వం దర్యాప్తును ప్రారంభించింది.

Debris from Saratov Airlines plane found outside Moscow

Russia opens probe into Saratov Airlines plane crash

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here