ఎర్ర స‌ముద్రంలో ఉద‌యించిన ఎర్ర సూరీడు!

మాస్కో: ఎర్ర స‌ముద్రంలో ఓ ఎర్ర సూరీడు ఉద‌యించాడు. నిజ్జంగా ఇది నిజం. ర‌ష్యాకు చెందిన ఓ ప‌ర్యాట‌కురాలు నిండు గ‌ర్భిణి. ఈజిప్ట్‌లో ప‌ర్య‌టిస్తోన్న ఆమె ఎర్ర స‌ముద్రాన్ని తిల‌కించ‌డానికి వెళ్లింది. స‌ముద్రంలో దిగి, స్నానం చేస్తోన్న స‌మ‌యంలో పురిటి నొప్పులు ఆరంభ‌మ‌య్యాయి.

వెంట వ‌చ్చిన త‌న భ‌ర్త‌, తండ్రి ఆమెకు పురుడు పోశారు. పండంటి మ‌గ‌బిడ్డ‌కు ఆమె జ‌న్మ‌నిచ్చింది. ఈజిప్ట్ తీర ప్రాంత ప‌ట్ట‌ణం ద‌హ‌బ్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. వారి పేర్లు, ఇత‌ర వివరాలేవీ తెలియ‌రావ‌ట్లేదు. బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన త‌రువాత ఆ కుటుంబం ద‌హ‌బ్ ప‌ట్ట‌ణంలోని ఓ ఆసుప‌త్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు.

అప్పుడే వారు ర‌ష్యాకు చెందిన ప‌ర్యాట‌కుల‌ని తేలింది. పురిటి నొప్పులు ఆరంభమైన స‌మ‌యంలో ద‌గ్గ‌ర్లో ఉన్న స్థానికుడొక‌రు ఆ దృశ్యాల‌ను త‌న మొబైల్‌లో బంధించారు. వాటిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ఆ మ‌హిళ ఆనందంగా స‌ముద్రపు అలల మ‌ధ్య నుంచి తీరానికి వ‌స్తుండ‌టం, ఒడ్డున ఆమె తండ్రి చేతిలో త‌న బొడ్డూడ‌ని కుమారుడు ఉండ‌టం, ఆ ప‌సివాడిని ఆ మ‌హిళ భ‌ర్త ఆప్యాయంగా ముద్దాడుతుండ‌టం ఈ ఫొటోల్లో చూడొచ్చు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here