తుప్పు పట్టిన కారు.. తక్కువ రేటే అని అనుకుంటే షాక్ అవుతారు..!

కారును చూశారుగా.. 40 ఏళ్లుగా ముందుకు కదలలేదు.. మొత్తం తుప్పుపట్టిపోయింది.. లోపల చాలా వరకూ సరిగా లేదు. ఇలాంటి కారును తక్కువ రేటుకే దక్కించుకోవచ్చు అని అనుకుంటే అది మీ పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఇది పోర్షే కంపెనీ కారు. దీని ధర ఇప్పుడు వేలంపాట వేస్తే భారత కరెన్సీలో 4,48,29,246 రూపాయలట.. దాదాపు నాలుగున్నర కోట్లకు పైనే దీన్ని అతి త్వరలో అమ్మబోతున్నారు.

1955 మోడల్ కు చెందిన పోర్షే కారు ఇది. ఈ కారును 1970లలో బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయని నడపలేదట. 52837 మైళ్ళు ఈ కారు ఇప్పటిదాకా తిరిగింది. ఈ కారును ఫ్లోరిడాలో త్వరలో వేలం వేయనున్నారు. 1950లలో తయారు చేసిన ఈ కారు అప్పటి అవసరాలకు అనుగుణంగా తయారు చేసిన స్పోర్ట్స్ కార్ అట..! కారు ఇంజన్ ను మార్చాల్సి ఉంటుందని పోర్షేలో పని చేసే వారు అంటున్నారు. వేలంపాటలో నాలుగున్నర కోట్ల బేస్ ప్రైస్ ను దాటి ఎవరు కొంటారా అని పోర్షే ప్రతినిధులు కూడా ఎదురుచూస్తూ ఉన్నారు. అమెరికా లోని ఓ కార్ పోర్ట్ లో దీన్ని పట్టించుకోకుండా వదిలిపెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here