ఏబీ..వియ్ మిస్ యు! డివిలియ‌ర్స్ నిర్ణ‌యంపై స‌చిన్ షాక్‌

క్రికెట్ చ‌రిత్ర‌లో స‌రికొత్త షాట్ల‌ను లిఖించిన ద‌క్షిణాఫ్రికా స్టార్ క్రికెట‌ర్ ఏబీ డివిలియ‌ర్స్ చేసిన ప్ర‌క‌ట‌న స‌చిన్ టెండుల్క‌ర్ దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకుంటున్న‌ట్టు హ‌ఠాత్తుగా ప్ర‌క‌టించారు డివిలియ‌ర్స్‌. ఈ నిర్ణ‌యం త‌న‌కు షాక్ క‌లిగించింద‌ని చెప్పారు స‌చిన్‌.

`వియ్ మిస్ యు..`అంటూ ట్వీట్ చేశారు. డివిలియ‌ర్స్‌తో క‌లిసి దిగిన ఓ ఫొటోను ఆయ‌న త‌న ట్వీట్‌కు జోడించారు. 360 డిగ్రీల ఆట‌గాడిగా ఘ‌న చ‌రిత్ర‌ను మిగిల్చావని స‌చిన్ ప్ర‌శంసించారు. వీరేంద‌ర్ సెహ్వాగ్ కూడా ఇదే త‌ర‌హా ట్వీట్ చేశారు. ప్ర‌పంచం ప్రేమించిన, అభిమానించిన క్రికెట‌ర్‌గా ఏబీ డివిలియ‌ర్స్ చ‌రిత్ర‌లో మిగిలిపోతార‌ని అన్నారు.

ఏబీడీ కేరీర్ అత్య‌ద్భుతంగా సాగింద‌ని అన్నారు. ఏబీ లేని అంత‌ర్జాతీయ క్రికెట్ వెలుగులు కోల్పోతుంద‌ని చెప్పారు. ఇంకా అద్భుత‌మైన కేరీర్ మిగిలి ఉండ‌గానే.. ఏబీ ఇంత అర్ధాంత‌రంగా క్రికెట్‌కు ఎందుకు గుడ్‌బై చెప్పార‌నేది కొరుకుడు ప‌డ‌ట్లేద‌ని నెటిజ‌న్లు చెబుతున్నారు. ఏబీ లేని ద‌క్షిణాఫ్రికా క్రికెట్ టీమ్‌.. ఇక‌ముందు ఎలా ఉంటుందోన‌ని ఆశ్య‌ర్య‌పోతున్నారు.

https://twitter.com/sambillings/status/999251081250062340

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here