40 మంది అమ్మాయిల‌ దుస్తుల‌ను విప్పించిన హాస్ట‌ల్ వార్డెన్‌..!

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సాగ‌ర్ జిల్లాలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. విద్యార్థినుల ప‌ట్ల లేడీస్‌ హాస్టల్ వార్డెన్ అమానుషంగా ప్ర‌వ‌ర్తించింది. హాస్ట‌ల్‌లో నివ‌సిస్తోన్న 40 మంది దుస్తుల‌ను ద‌గ్గ‌రుండి విప్పించింది. దీనికి కార‌ణం.. హాస్ట‌ల్ ఆవ‌ర‌ణ‌లో వాడేసిన శానిట‌రీ నాప్‌కిన్స్ క‌నిపించ‌డ‌మే.

బహిష్టు అయిన విద్యార్థిని ఎవ‌రైనా ఈ ప‌ని చేసి ఉంటార‌నే అనుమానించి వార్డెన్‌.. ఆమె ఎవ‌రో తెలుసుకోవ‌డానికి 40 మందితోనూ దుస్తుల‌ను విప్పించింది. తీవ్ర అవమానానికి గురైన విద్యార్థినులు వార్డెన్‌పై విశ్వ‌విద్యాల‌యం వైస్ ఛాన్స‌ల‌ర్‌కు ఫిర్యాదు చేశారు. అది ప్రైవేట్ హాస్ట‌ల్ కాదు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న హరిసింగ్‌ గౌర్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ అది. స్వాతంత్ర్యానికి ముందే ఏర్పాటైన యూనివ‌ర్శిటీల్లో అదీ ఒక‌టి. క్యాంప‌స్ ఆవరణలోని రాణి లక్ష్మీబాయి హాస్టల్‌లో ఉంది. అందులో 40 మందికిపైగా విద్యార్థినులు ఉంటున్నారు. శనివారం హాస్టల్‌ను తనిఖీచేసిన వార్డెన్‌.. వాడిపారేసిన శానిటరీ ప్యాడ్‌ పడిఉండటాన్ని చూసి కోపంతో చిందులేసింది.

తన సహాయకురాలితో కలిసి అమ్మాయిలందరినీ తనిఖీచేసింది. విద్యార్థినుల దుస్తులు విప్పించింది. ఆ మరుసటిరోజే విద్యార్థినులంతా కలిసి సదరు వార్డెన్‌ తీరుపై వీసీకి ఫిర్యాదుచేశారు. తక్షణమే వార్డెన్‌ను, సహాయకురాలిని తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై వైస్ ఛాన్స‌ల‌ర్ క్ష‌మాప‌ణ కోరారు. విచార‌ణ‌కు ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here