సన్ రైజర్స్ కు శుభవార్త.. 20 బంతుల్లో సెంచరీ చేసిన వృద్ధిమాన్ సాహా..!

వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ వృద్ధిమాన్ సాహా రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ముందు సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా 20 బంతుల్లోనే సెంచరీ బాదడం విశేషం. కలకత్తాలో జరుగుతున్న జేసీ ముఖర్జీ టీ20 ట్రోఫీలో ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు సాహా.. మోహన్ బగాన్ జట్టుకు ఆడుతున్న సాహా 20 బంతుల్లో 102 పరుగులు సాధించాడు. మొత్తం 18 బంతులు బౌండరీకి తరలించాడట.. 14 సిక్సర్లు.. 4 ఫోర్లు కొట్టాడు సాహా ఈ ఇన్నింగ్స్ లో. 152 పరుగుల లక్ష్యంతో బరి లోకి దిగిన సాహా జట్టు కేవలం 7 ఓవర్లలో చేజింగ్ చేసింది. ఎప్పుడూ లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే సాహా.. ఈసారి ఓపెనర్ గా వచ్చాడు. వచ్చీ రాగానే బౌలర్లను ఊచకోత కోశాడు. ఒక్క వికెట్ కూడా పడకుండానే మ్యాచ్ ముగించేయడం విశేషం.

ఈ ఏడాది ఐపీఎల్ లో సాహా హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుకు ఆడబోతున్నాడు. జనవరిలో జరిగిన వేలంపాటలో 5 కోట్ల రూపాయలు పెట్టి సన్ రైజర్స్ జట్టు సాహాను కొనుక్కుంది. ప్రస్తుతం భారత టెస్ట్ జట్టులో కూడా సహా సభ్యుడిగా ఉన్నాడు. సాహా ఆడిన ఇన్నింగ్స్ తో సన్ రైజర్స్ జట్టు కూడా ఎంతో ఆనందపడిపోతోంది. ఐపీఎల్ లో సాహా ఎన్నో మంచి ఇన్నింగ్స్ లు ఆడాడు.. ఈ ఏడాది సన్ రైజర్స్ కు ఎలాంటి విజయాలను అందిస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here